క్రీడాభూమి

ఇదేం కెప్టెన్సీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 17: భారత్‌తో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎదుర్కొన్న పరాజయంపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. ‘ఇదేం కెప్టెన్సీ? మెదడు ఉందా? లేదా? జట్టును ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నావా?’ అంటూ పాక్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ జట్టు బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే బలంగా ఉందనే విషయం సర్ఫ్‌రాజ్‌కు తెలియదా? అని నిలదీశాడు. ఎంతో కీలకమైన టాస్ గెలిచినప్పటికీ, బ్యాటింగ్‌ను ఎంచుకోకుండా, ఫీల్డింగ్ తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. టాస్ వేసే సమయానికి పిచ్‌పై పెద్దగా తేమలేదని, ఔట్ ఫీల్డ్ కూడా పొడిగానే ఉందని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, ముందుగా బ్యాటింగ్‌కు దిగి, సాధ్యమైనంత ఎక్కువ స్కోరు చేయాలేగానీ, అందుకు భిన్నంగా బౌలింగ్ ఎంచుకోకూడదని చెప్పాడు. ఛేజింగ్‌లో బలంగా లేమని తెలిసిన తర్వాత కూడా, టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. భారత్‌ను ముందు బ్యాటింగ్‌కు దింపి, ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ విఫలమైన సందర్భాలను అక్తర్ గుర్తుచేశాడు. 1999 ప్రపంచ కప్‌లో ఇంజమాముల్ హక్, మహమ్మద్ యూసుఫ్, సరుూద్ అన్వర్, షాహిద్ అఫ్రిదీ వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ, తమ ముందు ఉన్న 227 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని చెప్పాడు. గతం నుంచి పాఠాలు కూడా నేర్చుకోకపోతే ఎలా అంటూ పాక్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్‌పై విరుచుకుపడ్డాడు. ‘టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉండింది. కానీ, నువ్వు ఫీల్డింగ్‌ను ఎంచుకున్నావ్? ఎంతో కీలకమైన టాస్ మనకు అనుకూలించినప్పటికీ, ఆ అవకాశాన్ని చేజార్చుకున్నావ్? జట్టు ఓడిపోవాలని కంకణం కట్టుకున్నట్టు వ్యవహరించావ్? నీకు అసలు తెలివి ఉందా? బుద్ధిలేని నిర్ణయాలు జట్టుకు హాని చేస్తాయని తెలియదా?’ అంటూ సర్ఫ్‌రాజ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. మీడియం పేసర్ హసన్ అలీ బౌలింగ్ తీరును కూడా అక్తర్ తప్పుపట్టాడు. 9 ఓవర్లలో 84 పరుగులిచ్చిన అలీ ఒక వికెట్ మాత్రమే కూల్చాడు. ఈ విషయాన్ని అక్తర్ ప్రస్తావిస్తూ, ప్రపంచ కప్ వంటి మెగా ఈవెంట్స్‌లో 84 పరుగులు సమర్పించుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. భారీగా పరుగులిస్తున్న అతనితో తొమ్మిది ఓవర్లు బౌల్ చేయించిన సర్ఫ్‌రాజ్ తెలివిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని విమర్శించాడు. అతని బౌలింగ్‌లో స్వింగ్‌గానీ, వేగంగానీ లేవని అన్నాడు. అందరూ కలసికట్టుగా భారత్ చేతిలో పాక్ పరాజయానికి కారకులయ్యారని ధ్వజమెత్తాడు. ముఖ్యంగా సర్ఫ్‌రాజ్ తెలివిలేని నాయకత్వమే పాక్‌ను ఓడించిందని అన్నాడు.