క్రీడాభూమి

భువీకి విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 17: ఎడమకాలి కండరాలు బెణకడంతో బాధపడుతున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తన మూడో ఓవర్ వేస్తున్నప్పుడు అతని కాలు ఫాలోత్రూలో ఏర్పడిన బౌలర్ల ఫుట్‌మార్క్‌లో పడింది. దీనితో కంరడాలు బెణికాయి. ఫలితంగా అతను ఆ ఓవర్‌లో మిగతా రెండు బంతులు వేయకుండానే వెనుదిరిగాడు. ప్రస్తుతం వైద్య సేవలు పొందుతున్న అతను రెండుమూడు మ్యాచ్‌ల్లో ఆడలేకపోవచ్చని సమాచారం. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, పూర్తి ఫిట్నెస్ తర్వాత అతను మళ్లీ ఆడతాడని చెప్పాడు. అప్పటి వరకూ భువీ స్థానాన్ని మహమ్మద్ షమీతో భర్తీ చేస్తామని పేర్కొన్నాడు. కాగా, ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ బొటనవేలి గాయంతో బాధపడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అతను నాకౌట్ మ్యాచ్‌లు ఆరంభంలోగా పూర్తి ఫిట్నెస్‌తో ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్ ఆశాభావంతో ఉంది.
ఇతర జట్లకూ ఇదే సమస్య..
వరల్డ్ కప్‌లో ఆడుతున్న ఇతర జట్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ అండ్రె రసెల్ సంపూర్ణ ఫిట్నెస్‌తో లేడు. అతను గాయాల సమస్యతో బాధపడుతున్నప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితుల్లో బరిలోకి దించక తప్పలేదని విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉంది కాబట్టే, ఇంగ్లాండ్‌పై అతనిని ఆడించినట్టు చెప్పాడు. అయితే, మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను పట్టుతప్పి కిందపడ్డాడు. సోమవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ అతను ఆడినప్పటికీ, ఫిట్నెస్ సమస్య నుంచి బయటపడ్డాడా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. కాగా, ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రీలంక బౌలర్ ఇసురు ఉడానా భుజానికి గాయమైంది. దీనితో అతను ప్రాథమిక వైద్య సేవలు పొందాడు. అది ఎప్పుడు, ఏ రకంగా మారుతుందోనని లంక మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతున్నది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. పక్కటెముకల వద్ద కండరాలు పట్టడంతో అతను బౌలింగ్ వేయడం లేదు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న భువనేశ్వర్ కుమార్ వచ్చే మ్యాచ్‌కి గాయం నుంచి కోలుకొని సిద్ధంగా ఉం టాడా? లేక మరికొంత కాలం విశ్రాంతి తీసుకుంటాడా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మొత్తం మీద గాయపడుతున్న ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుతునే ఉంది. వీరిలో చా లా మంది ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడినవారే కావడం గమనార్హం. ఐపీఎల్ వల్ల ఆటగాళ్లు గాయాలబారిన పడుతున్నారని, ఆతర్వాత జాతీయ జట్లకు సేవలు అందించడం లేదని వివిధ క్రికెట్ బోర్డులు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో పరిస్థితిని గమనిస్తుంటే, ఈ విమర్శల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.