క్రీడాభూమి

సెమీస్‌పై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 17: వరల్డ్ కప్ టైటిల్ ఫేవరిట్స్‌లో ఒకటైన ఇంగ్లాండ్ సెమీస్‌పై దృష్టి కేంద్రీకరించి, మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నది. కొంత మంది కీలక ఆటగాళ్లను ఫిట్నెస్ సమ స్య వేధిస్తున్నప్పటికీ, అఫ్గాన్ కంటే ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న ది. హోం గ్రౌండ్‌లో ఆడడం, వేలాది మంది అభిమాల మద్దతు లభించడం ఈ జట్టుకు అదనపు బలాన్నిస్తున్నాయి. ఒకవేళ మోర్గాన్ మ్యాచ్ ఆడలేకపోతే, అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జొస్ బట్లర్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. టామ్ కూరెన్, మోయిన్ అలీ వంటి ఆటగాళ్లతో కూడిన బెంచ్ బలాన్ని అంచనా వేయడానికి తగిన అవకాశం లభించిందని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, వరల్డ్ కప్‌లో రెండోసారి ఆడుతున్న అఫ్గానిస్తాన్ తొలి విజయం కోసం ఎదురు చూస్తున్నది. ఈసారి ఇంతవరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ పరాజయాలను చవిచూసిం ది. అయితే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలం క, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో గొ ప్పగానే పోరాడిన ఈ జట్టు ఇంగ్లాండ్‌ను ఓ డించాలన్న పట్టుదలతో ఉంది. బౌలింగ్ విభాగం కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, బ్యా టింగ్ వైఫల్యాలు జట్టును వేధిస్తున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లోనూ నలభైకి పైగా ఓవర్ల ను ఈ జట్టు ఇంతవరకూ ఆడలేదు. దక్షిణాఫ్రికాపై ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, నూర్ అలీ జద్రాన్ ఆచితూచి ఆడుతూ, చక్కటి ఆరంభాన్నిచ్చినా, ఆ అవకాశాన్ని మిగతా వారు అందిపుచ్చుకోలేకపోయారు. చివరిలో రషీద్ ఖాన్ బ్యాటింగ్ ప్రతిభ అఫ్గాన్ ఇన్నింగ్స్‌కు కొంతవరకు ఊపిరిపోసింది. మేటి ఆల్‌రౌండర్‌గా రూపుదిద్దుకుంటున్న అతని నుం చి అఫ్గాన్ మరోసారి ఉత్తమ ప్రదర్శనను కోరుకుంటున్నది. ఇంగ్లాండ్‌తో పోలిస్తే, అన్ని విభాగాల్లోనూ బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్స్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం క ష్టం. అనామక జట్లు ఒక్కోసారి సంచలన విజయాలను నమోదు చేసిన సంఘటలను చాలానే ఉన్నాయి. అదే తరహాలో ఇంగ్లాండ్‌పై అఫ్గాన్ గెలిచినా ఆశ్చర్యం లేదు. కానీ, ఎలాంటి అద్భుతాలు జరగకపోతే మాత్రం ఇంగ్లాండ్ విజయాన్ని నిలువరించడం అఫ్గాన్‌కు అసాధ్యమనే చెప్పాలి.