క్రీడాభూమి

నేను స్వదేశం వచ్చే పరిస్థితుల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 18: భారత్ చేతిలో 89 పరుగుల పరాజయం తర్వాత పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహమ్మద్ జట్టు సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయ. ‘మిగతా మ్యాచుల్లో పరిస్థితి మారకుంటే సొంత దేశంలో అడుగు పెట్టలేను’ అని సర్ఫరాజ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్‌కు చెందిన ‘ది న్యూస్’ పత్రిక పేర్కొంది. ది న్యూస్ కథనం ప్రకారం.. ‘అభిమానుల ఆగ్రహాన్ని ప్రతి ఒక్కరూ భరించాల్సిందే. నేను తిరిగి ఇంటికి వెళ్తానంటే అది పొరపాటే. దురదృష్టవ శాత్తూ వచ్చే మ్యాచుల్లో మన ప్రదర్శన బాగా లేకపోతే నేను ఇక ఇంటికి తిరిగి వెళ్లలేను’ అని సర్ఫరాజ్ అన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా జట్టులో తానొక్కడినే స్వదేశానికి వచ్చే పరిస్థితుల్లేవని, మిగతా వారందరికీ ఎలాంటి ఇబ్బంది ఉండబోదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక అయిందేదో అయపోయిందని, జరగాల్సిన మ్యాచుల్లోనైనా రాణించి తలెత్తుకోవాలని సహచరులకు సూచించినట్లు ది న్యూస్ పేర్కొంది. సర్ఫరాజ్ మాట్లాడుతున్నంత సేపు సీనియర్ ఆటగాళ్లు షోయాబ్ మాలిక్, మహమ్మద్ హఫీజ్‌లు వౌనంగా ఉన్నట్లు పత్రిక తెలిపింది.