క్రీడాభూమి

మళ్లీ జట్టులోకి వస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 18: ప్రపంచ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఈనెల 25న లార్డ్స్ మైదానంలో జరుగబోయే మ్యాచ్‌కు మళ్లీ జట్టులోకి వస్తాననే గట్టి నమ్మకం తనకు ఉందని ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్ ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారంనాడు ఓల్డ్ టఫోర్డ్‌లో అఫ్గానిస్తాన్‌తో ఇంగ్లాండ్ తలపడిన మ్యాచ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన జాసన్ రాయ్‌కి హెడ్డింగ్లేలో గత శుక్రవారంనాడు జరిగిన మ్యాచ్‌లో సైతం ప్రాతినిధ్యం దక్కలేదు. గత వారం వెస్టిండీస్‌తో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించినపుడు కూడా జట్టులో చోటు దక్కినా జో రూట్‌తో కలసి బ్యాటింగ్‌కు చేసేందుకు అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో జానీ బెయిర్ స్టోతో కలసి ఆడిన రూట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా కరేబియన్లతో జరిగిన మ్యాచ్‌లో జాసన్ రాయ్ గాయపడ్డాడు. అయితే, ఇపుడు తాను మళ్లీ జట్టులోకి వస్తాననే బలమైన నమ్మకం ఉందని అంటున్నాడు 28 ఏళ్ల జాసన్ రాయ్. ‘వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను జట్టులో ఉన్నాను. కానీ సరిగా ఆడలేకపోయాను’ అని ఒక మీడియాతో మాట్లాడుతూ జాసన్ రాయ్ పేర్కొన్నాడు. ఇదిలావుండగా, ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో అర్ధ శతకం నమోదు చేసిన జాసన్ రాయ్, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై 153 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సమయంలో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ట్రెంట్ బ్రిడ్జిలో పాకిస్తాన్‌తో ఇంగ్లాండ్ తలపడిన మ్యాచ్‌లో కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలావుండగా, ఈనెల 25న ప్రస్తుత చాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు మరో వారం రోజులు ఎలా గడుస్తాయోనని ఎదురుచూస్తున్నానని ఈ సుర్రే స్టార్ క్రికెటర్ జాసన్ రాయ్ అన్నాడు. ఇదిలావుండగా, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వెన్నునొప్పితో బాధపడినా కోలుకుని మంగళవారంనాడు అఫ్గానిస్తాన్‌తో జరిగిన వనే్డ మ్యాచ్‌లో ఆడాడు. ఇపుడు కూడా జాసన్ రాయ్ జట్టులో చోటు దక్కించుకోవడం ద్వారా మునుపటి ఫామ్‌ను కనబరుస్తాడనే నమ్మకాన్ని ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యక్తం చేశాడు. జట్టులో ఎవరి స్థానంలో జాసన్ రాయ్‌ని తీసుకోవాలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయించలేదని, అయినా మంచి ఫామ్‌లో ఉన్న రాయ్ తమకు ఎంతో ముఖ్యమని కెప్టెన్ పేర్కొన్నాడు.