క్రీడాభూమి

నేను వంద శాతం ఫిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 18: తాను శారీరకంగా వంద శాతం ఫిట్‌గా ఉన్నానని దక్షిణాఫ్రికా పేసర్ లున్గీ ఎన్గిడి స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనున్న నేపథ్యంలో తనను బరిలోకి దించుతారా? లేదా? అన్న అనుమానాలతోపాటు తన ఫిట్నెస్‌పై వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశాడు. వరల్డ్ కప్‌లో తన ఖాతాను మెరిసేందుకు దక్షిణాఫ్రికా బహు దూరంలో ఉంది. ఇప్పటికే ఈ టీమ్ ఆడిన మూడు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో తుడిచిపెట్టుకుపోయింది. అదే తరుణంలో పేసర్ లున్గీ ఎన్గిడి తొలి ఓపెనింగ్ గేమ్స్‌లో ఆడినా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో ఈ పేసర్ ఫిట్నెస్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్గిడి దీనిపై మంగళవారంనాడు ఒక స్పష్టత ఇచ్చాడు. ‘ఇపుడు కఠిన పరిస్థితి ఉంది. గాయాలెప్పుడూ మంచివి కావు. కానీ నా మద్దతు జట్టుకు ఎల్లపుడూ ఉంటుంది. నేను ఇపుడు శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను’ అని వరల్డ్ కప్ క్రికెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్పష్టం చేశాడు. ‘గాయాలనేవి ఒత్తిడికి గురిచేస్తాయి తప్ప ఆడకుండా ఆపలేవు. నాకు తగిలిన గాయాలు మటుమాయమయ్యాయి. ఈరోజు నేను ఫిట్నెస్‌గా ఉన్నాను. అంటే తదుపరి (బుధవారం నాటి) మ్యాచ్‌కు నేను 100 శాతం సిద్ధమే. 100 శాతం బౌలింగ్ చేయడానికి సిద్ధంగా లేమంటే దాని అర్థం ఆడేందుకు సిద్ధంగా లేమనేగా’ అని అన్నాడు ఈ యువ ఫాస్ట్ బౌలర్ ఎన్గిడి. దక్షిణాఫ్రికా జట్టులోని దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ డేల్ స్టెయిన్‌ను ఈ టోర్నమెంట్ నుంచి పూర్తిగా బహిష్కరించడంతో ఎన్గిడి ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో ఆడాడు. బుధవారంనాడు న్యూజిలాండ్‌తో తమ జట్టు పోటీ పడనున్న నేపథ్యంలో ఆ టీమ్‌కు ఉన్న బలహీనతలు బయటపడతాయని ఎన్గిడి పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ జట్టులోని మిడిలార్డర్, లోవర్ ఆర్డర్ సరిగా రాణించలేవని తాను భావించడం లేదని అన్నాడు. అయితే, ఆ జట్టులో టాప్ ఆర్డర్ ఎక్కువ పరుగులు సాధించే అవకాశం ఉన్నందున వారి బలహీనతలపై దెబ్బకొడితే మ్యాచ్‌ను మలుపు తిప్పవచ్చునని అభిప్రాయపడ్డాడు. 23 ఏళ్ల ఈ పేసర్ మళ్లీ రావడంతో జట్టుకు ఎంతో బలం చేకూరినట్టు అవుతుందని యాజమాన్యం అభిప్రాయపడుతోంది. ఇంతవరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడింటిని కూడా దక్షిణాఫ్రికా కోల్పోయింది. ఇపుడు సెమీఫైనల్‌లో బెర్త్ ఖాయం చేసుకోవాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలుపు సాధించాల్సిందే.