క్రీడాభూమి

మోర్గాన్ సిక్సర్ల సునామీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 18: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సెంచరీకి తోడు జానీ బెయర్‌స్ట్రో, జో రూట్ అర్ధ సెంచరీలు సాధించడంతో మంగళ వారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇం గ్లాండ్ భారీ విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో జేమ్స్ విన్స్, జానీ బెయర్ స్టోలు ఇన్నిం గ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 44 పరుగుల వద్ద విన్స్ (26)ను దౌలత్ జర్దాన్ అవుట్ చేయడంతో ఆతిథ్య జట్టు మొదటి వికెట్‌ను కోల్పోయంది. ఆ త ర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్‌తో కలిసి బెయర్ స్టో చెలరేగిపోయాడు. అఫ్గాన్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా వీరిద్దరూ ఆకాశమే హద్దు గా చెలరేగిపోయారు. ఈ దశలో బెయర్ స్టో (90) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే నయబ్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 120 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జట్టు కు అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో జతకట్టిన జో రూట్ కూడా 32వ అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు మోర్గాన్ వచ్చీరాగానే అఫ్గాన్ బౌలర్లపై విరుచు కుపడ్డాడు. కేవలం 36 బంతుల్లోనే సిక్సర్ సా యంతో అర్ధ సెంచరీ సాధించాడు. అదే జోరు మీదున్న ఇంగ్లీష్ కెప్టెన్ ఏ దశలోనూ ప్రత్యర్థి బౌలర్లను విడిచి పెట్టలేదు. అర్ధ సెంచరీకి 36 బంతులు తీసుకున్న మోర్గాన్ మరో 50 పరుగులకి కేవలం 21 బంతులే తీసుకోవడం గమనార్హం. సెంచరీని కూడా సిక్సర్ సాయంతో సాధించడం విశేషం. ఈ క్రమంలో జో రూట్ (88)ని నయబ్ పెవిలియన్‌కు పంపి వీరి జోడిని విడదీశాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 189 పరుగులను జోడించారు. అదే ఓవర్‌లో చివరి బంతికి మోర్గాన్ (148) కూడా అవుట య్యాడు. దీంతో ఇంగ్లాండ్ 359 పరుగులకు 4 వికెట్లు కోల్పోయంది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ (2), బెన్ స్టోక్స్ (2) వికెట్లను దౌలత్ జోర్దాన్ పడగొట్టగా మొయన్ అలీ (31, నాటౌట్) చివర్లో చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లోనే 9 బౌండరీలు, 1 సిక్సర్‌ను కొట్టి అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అప్పటికే ఇన్నింగ్స్ ముగియడంతో క్రిస్ వోక్స్ (1, నాటౌట్) క్రీజులో ఉన్నాడు. దీంతో ఇంగ్లాం డ్ 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయ 397 పరు గుల భారీ స్కోరు సాధించింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో దౌలత్ జర్దాన్, కెప్టెన్ గుల్బదిన్ నయబ్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు.
మోర్గాన్ ఖాతాలో అరుదైన రికార్డు..
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 17 సిక్సర్లను కొ ట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో వనే్డల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘన తను దక్కించుకున్నాడు. మోర్గాన్ తర్వాత టీ మిండియాకు చెందిన రోహిత్ శర్మ (16), దక్షిణా ఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ (16), వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్‌గేల్ (16) ఉన్నారు.
57 బంతుల్లో సెంచరీ..
అఫ్గాన్‌న్ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 57 బంతుల్లోనే సెంచరీ సా ధించి అరుదైన ఘనతను సాధించాడు. మోర్గాన్ కంటే ముందు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఒబ్రెయన్ 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 50 బంతుల్లోనే సెంచరీ సాధించి ముందు వరుస లో ఉన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ గత ప్రపంచకప్‌లో శ్రీలంకపై 51 బంతుల్లో శతకం బాదాడు. ఇక మోర్గాన్ త ర్వాత ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్ (66 బంతుల్లో), కెనడాకు చెందిన జాన్ డేవిడ్ సన్ (67 బంతుల్లో) సెంచరీలు సాధించారు.
అయ్యో.. రషీద్ ఖాన్..
అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన్ రషీద్ ఖాన్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ల విధ్వంసం తో వికెట్ తీయకుండా 110 పరుగులిచ్చాడు. అతడి ఎకానమీ ఏకంగా 12.22 ఉండడం విశే షం. అఫ్గాన్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రహమన్ మినహా 10 ఓవర్లు వేసిన బౌలర్లంతా 60కి పైగా పరుగులు సమర్పిం చుకోవడం విశేషం.
షాహిది ఒక్కడే..
లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ జట్టులో హష్మతుల్లా షాహిది ఒక్కడే 76 పరుగులు చేశాడు. రహమత్ షా (46), అస్గర్ అఫ్గాన్ (44), గుల్బదిన్ నయబ్ (37) ఫర్వాలేదనిపించినా, మిగతా బ్యాట్ సమెన్లంతా విఫలమ వడంతో అఫ్గాన్ పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లు నష్టపోయ 247 పరుగులు మాత్రమే చేసి 150 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్ మూడేసి వికెట్లు తీయగా, మార్క్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయ.
స్కోరు బోర్డు..
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జేమ్స్ విన్స్ (సీ) ముజీబ్ (బీ) దౌలత్ జర్దాన్ 26, జానీ బెయర్‌స్ట్రో (సీ), (బీ) నయబ్ 90, జో రూట్ (సీ) రహమత్ (బీ) నయబ్ 88, ఇయాన్ మోర్గాన్ (సీ) రహమత్ (బీ) నయబ్ 148, జోస్ బట్లర్ (సీ) నయబ్ (బీ) దౌలత్ జర్దాన్ 2, బెన్ స్టోక్స్ (బీ) దౌలత్ జర్దాన్ 2, మొయన్ అలీ (నాటౌట్) 31, క్రిస్ వోక్స్ (నాటౌట్) 1. ఎక్స్‌ట్రాలు: 9 మొత్తం: 397 (50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-44, 2-164, 3-353, 4-359, 5-362, 6-378
బౌలింగ్: ముజీబ్ ఉర్ రహమన్ 10-0-44-0, దౌలత్ జర్దాన్ 10-0-85-3, మహమ్మద్ నబీ 9-0-70-0, గుల్బదిన్ నబీ 10-0-68-3, రహమత్ షా 2-0-19-0, రషీద్ ఖాన్ 9-0-110-0.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: నూర్ అలీ జర్దాన్ (బీ) జోఫ్రా ఆర్చర్ 0, గుల్బదిన్ నయబ్ (సీ) జోస్ బట్లర్ (బీ) మార్క్ వుడ్ 37, రహమత్ షా (సీ) బెయర్ స్టో (బీ) అదిల్ రషీద్ 46, హష్మతుల్లా షాహిది (బీ) జోఫ్రా ఆర్చర్ 76, అస్గార్ అఫ్గాన్ (సీ) రూట్ (బీ) అదిల్ రషీద్ 44, మహమ్మద్ నబీ (సీ) స్టోక్స్ (బీ) అదిల్ రషీద్ 9, నజీబుల్లా జర్దాన్ (బీ) మార్క్‌వుడ్ 15, రషీద్ ఖాన్ (సీ) బెయర్ స్టో (బీ) జోఫ్రా ఆర్చర్ 8, ఇక్రాం అలీ కిల్ (నాటౌట్) 3, దౌలత్ జర్దాన్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 9 మొత్తం: 247 (50 ఓవర్లలో 8 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-4, 2-52, 3-104, 4-198, 5-210, 6-234, 7-234, 8-247
బౌలింగ్: క్రిస్ వోక్స్ 9-0-41-0, జోఫ్రా ఆర్చర్ 10-1-52-3, మొయన్ అలీ 7-0-35-0, మార్క్ వుడ్ 10-1-40-2, బెన్ స్టోక్స్ 4-0-12-0, అదిల్ రషీద్ 10-0-66-3.

చిత్రం...ఇయాన్ మోర్గాన్ (148)