క్రీడాభూమి

వారెవ్వా.. వార్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్, జూన్ 20: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడడంతో 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వీరి దూకుడుకు బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆరోన్ ఫించ్ (53) సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో రూబెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజాతో కలిసి వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అర్ధ సెంచరీ 55 బంతులు తీసుకున్న వార్నర్ సెంచరీకి 112 బంతులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖాజా కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సెంచరీ తర్వాత మరింత చెలరేగి ఆడిన వార్నర్ (166) సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లోనే రూబెల్ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఈ మెగా టోర్నీలో డేవిడ్ వార్నర్‌కిది రెండో సెంచరీ కాగా, ఓవరాల్‌గా 16వది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10 బంతుల్లోనే 32 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖా జా (89) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా, స్టీవెన్ స్మిత్ (1), నిరాశ పరిచాడు. అప్పటికీ ఇన్నింగ్స్ పూర్తి కావడం తో మార్కస్ స్టొయనిస్ (17, నాటౌట్), అలెక్స్ క్యారీ (11, నాటౌట్) క్రీజులో ఉండ డంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 381 పరుగుల భారీ స్కోరు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్యా సర్కార్ 3 వికెట్లు తీసుకోగా, ముస్తాఫిజుర్ రహమన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
గెలవాలనే కసితో
382 పరగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ గెలవాలనే కసితో ఆడింది. 23 పరుగుల వద్ద ఓపెనర్ సౌమ్యా సర్కార్ (10) వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్‌తో కలిసి తమీమ్ జట్టు స్కోరును పెంచే బాధ్యత తీసుకున్నాడు. అయతే షకీబ్ (41) గత మ్యాచుల్లోలాగే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి స్టొయనిస్ బౌలింగ్‌లో వార్నర్ చేతికి చిక్కాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ముషిఫికర్ రహీమ్ అండతో తమీమ్ ఇక్బాల్ (62) అర్ధ సెంచరీ సాధించి, కొద్దిసేపటికే స్టార్ట్ బౌలింగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 144 పరుగులకే బంగ్లా 3 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. మరోవైపు క్రీజులోకి వచ్చిన లిటన్ దాస్ (20) వచ్చీ రావడంతోనే మూడు బౌండరీలు బాది మంచి ఫాంలో కనిపించినా జంపా బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన మహ్మదుల్లా (69) రాణించినా, షబ్బీర్ రహమన్ (0) పరుగులేమీ చేయకుండానే గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. చివర్లో మెహిడీ హసన్ (6), మషఫ్రే మోర్తాజా (6) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
ముషిఫికర్ రహీమ్ సెంచరీ..
ఓవైపు వికెట్లు పడుతున్నా ముషిఫికర్ రహీమ్ (102, నాటౌట్) సెంచరీ సాధించాడు. ప్రపంచకప్‌లో రహీమ్‌కిదే అత్యధిక స్కోరు. అయతే ఇన్నింగ్స్ చివరి వరకు నాటౌట్‌గా ఉన్నా జట్టును గెలిపించ లేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియా 48 పరు గుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయనిస్‌లు తలో రెండు వికెట్లు దక్కించుకోగా, జంపాకు 1 వికెట్ దక్కింది.

చిత్రాలు.. డేవిడ్ వార్నర్ (166) *ముషిఫికర్ రహీమ్