క్రీడాభూమి

ఆరెంజ్ జెర్సీలో మెన్ ఇన్ బ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 20: భారత క్రికెట్ జట్టు జెర్సీ మారనుంది. ఇప్పటివరకు బ్లూ జెర్సీలో బరిలోకి దిగిన కోహ్లీ సేన ఇంగ్లాండ్‌తో ఈ నెల 30న జరిగే మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీలో మెరవనుంది. అయతే ఇది కేవలం ఈ ఒక్క మ్యాచ్ వరకు మాత్రమే. అసలు విషయం ఏం టంటే ఈ ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగడమే. భారత జట్టు జెర్సీ రంగు కూడా అదే కావడంతో టీవీ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశ ముంది. ఈ క్రమంలో ఐసీసీ జెర్సీ రంగులు ఒకేలా ఉండకుండా ప్రత్యామ్నాయ జెర్సీలకు అవకాశం కల్పించింది. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే జట్లు విభిన్న రంగులున్న రెండు జెర్సీ లను కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆతిథ య జట్టుకు మినహాయంపు ఉంటుంది. ప్రత్యా మ్నాయ రంగు ఎంపికలో జట్లదే పూర్తి స్వేచ్ఛ. కానీ ఒక రంగునే టోర్నీ మొత్తం కొనసా గించాలి. ఒకే రంగు జెర్సీ కలిగిన జట్లు తలపడినపుడు మాత్రం ప్రత్యామ్నాయ జెర్సీని ధరించాల్సి ఉంటుంది. ఈ విషయం ముందే తెలియజేయాలని ఐసీసీ ఒక ప్రకటనలో పే ర్కొంది. వాస్తవానికి శనివారం అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌కే భారత జట్టు జెర్సీ మారనుందని ప్రచారం జరిగినా ఈ మ్యాచ్‌కు అఫ్గాన్ జట్టే ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగుతుం డడంతో భారత్ బ్లూ జెర్సీలోనే మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ మెగాటోర్నీలో ఇప్పటికే బంగ్లా దేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు యెల్లో జెర్సీతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలాగే పాకిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు కూడా ఆయా జట్లు జెర్సీలు మార్చుకో నున్నాయ.