క్రీడాభూమి

ఎదురీత తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్: ఈసారి ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో నిరాశాజనకంగా సాగుతున్న శ్రీలంక ప్రస్థానానికి మరో అడ్డంకి ఇంగ్లాండ్ రూపంలో ఎదురుకానుంది. ఫేవరిట్స్ జాబితాలో ముందు వరుసగాలో ఉన్న బలమైన ఇంగ్లాండ్‌తో శుక్రవారం గ్రూప్ మ్యాచ్‌లో తలపడనున్న శ్రీలంకకు ఎదురీత తప్పకపోవచ్చు. ఏ రకంగా చూసినా ఇంగ్లాండ్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ జట్టును ఓడించాలంటే, శ్రీలంక సర్వశక్తులు ఒడ్డాలి. దిముత్ కరుణరత్నే నాయకత్వంలోని శ్రీలంక ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌లను చూస్తే, ఇంగ్లాండ్ విజయం ఖాయమని విశే్లషకులు అంటున్నారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫిటెస్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడడం, అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుత సెంచరీ చేయడం ఇంగ్లాండ్‌కు మరింత బలాన్నిస్తున్నది. ఈ జట్టు ఇంత వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడి, నాలుగు విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికాపై 104 పరుగులు, బంగ్లాదేశ్‌పై 106 పరుగులు, వెస్టిండీస్‌పై 8 వికెట్లు, గత మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 150 పరుగుల తేడాతో విజయాలను నమోదు చేసింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా 14 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
అఫ్గాన్‌పై భారీ స్కోరు..
గత మ్యాచ్‌లో అఫ్గాన్‌ను ఓడించిన తీరు ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు సాధించిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ సత్తాని నిరూపించుకుంది. అంతకు ముందు తలెత్తిన ఫిట్నెస్ సమస్య నుంచి పూర్తిగా బయటపడిన కెప్టెన్ మోర్గాన్ 148 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో 90, జో రూట్ 88 చొప్పున పరుగులు చేశారు. చివరికి లోయర్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన మోయిన్ అలీ కూడా ఇంగ్లాండ్ భారీ స్కోరుకు తనవంతు సాయంగా 31 పరుగులు అందించాడు. అనంతరం ఇంగ్లాండ్ బౌలర్లు అఫ్గానిస్తాన్‌ను 50 ఓవర్లలో 8 వికెట్లకు 247 పరుగులకే కట్టడి చేసింది. హష్మతుల్లా షహిదీ 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ గుల్బదీన్ నబీ 37, రహ్మత్ షా 46, అస్ఘర్ అఫ్గాన్ 44 చొప్పున పరుగులు చేశారు. కాగా, ఇంగ్లాండ్ బౌలర్లు జొఫ్రా ఆర్చర్ 52 పరుగులకు మూడు, అదిల్ రషీద్ 66 పరుగులకు మూడు, మార్క్ ఉడ్ 40 పరుగులకు రెండు చొప్పున వికెట్లు తీశారు. అయితే, క్రిస్ వోక్స్ (9 ఓవర్లలో 41 పరుగులు), మోయిన్ అలీ (7 ఓవర్లలో 35 పరుగులు), బెన్ స్టోక్స్ (నాలుగు ఓవర్లలో 12 పరుగులు) ఒక్క వికెట్ కూడా సాధించలేకపోవడం ఇంగ్లాండ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. వీరు కూడా రాణిస్తే, అఫ్గాన్ ఆలౌటై ఉండేదని వారు అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో పసికూన జట్టు అఫ్గాన్‌ను ఆలౌట్ చేయలేకపోతే, కీలక మ్యాచ్‌ల్లో, బలమైన జట్లు ఎదురుపడితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న అభిమానులను వేధిస్తున్నది. ఎవరి భయాలు ఎలావున్నా, శ్రీలంకతో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ప్రతి ఒక్కరూ హాట్ ఫేవరిట్‌గానే అభివర్ణిస్తున్నారు.
రెండు మ్యాచ్‌లు వర్షార్పణం..
శ్రీలంకను వర్షం వెంటాడుతున్నది. ఇంత వరకూ ఐదింటిలో మూడు మ్యాచ్‌లను మాత్రమే లంక ఆడగలిగింది. మిగతా రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ జట్టు ఒక మ్యాచ్‌ని గెల్చుకోగా, రెండు పరాజయాలను ఎదుర్కొంది. తొలి మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌ను ఢీకొని ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అఫ్గానిస్తాన్‌పై 34 పరుగులతో గెలవగా, బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో జరగాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొన్నప్పుడు అన్ని విభాగాల్లోనూ విఫలమై, 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లీడ్స్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 334 పరుగులు సాధించింది. ఇసురు ఉడానా, ధనంజయ సిల్వ చెరి రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, వరుసగా 57, 40 చొప్పున పరుగులు సమర్పించుకన్నారు. స్టార్ పేసర్ లసిత్ మలింగ ఒక వికెట్ కోసం, 10 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చాడు. నువాన్ ప్రదీప్ 10 ఓవర్లలో 88, తిసర పెరెరా 10 ఓవర్లలో 67 చొప్పున పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా కూల్చలేదు. చివరికి పార్ట్‌టైమ్ బౌలర్ మిలింద సిరివర్దనను బరిలోకి దించినా, అతను రెండు ఓవర్లు బౌల్ చేసి, 17 పరుగులిచ్చాడు. వికెట్‌ను మాత్రం కూల్చలేకపోయాడు. లంక బౌలర్ల వైఫల్యం ఈ మ్యాచ్‌లో స్పష్టం గా కనిపించింది. అనంతరం లక్ష్య సాధన కోసం మైదానంలోకి దిగినప్పుడు, బ్యాట్స్‌మెన్ సైతం వారితో పోటీపడుతూ దారుణంగా ఆడారు. ఫలితంగా ఆ జట్టు 45.5 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (97), కుశాల్ పెరెరా (52) మొదటి వికెట్‌కు 115 పరుగులు జోడించినప్పటికీ, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారెవరూ బాధ్యతాయుతంగా ఆడలేదు. చివరిలో కుశాల్ మేండిస్ చేసిన 30 పరుగులు జట్టును ఆదుకోలేకపోయాయి. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలం కావడం లంక అభిమానులను భయాందోళనకు గురిచేస్తున్నది. ఇంగ్లాండ్‌తో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్న లంక ఏ స్థాయిలో పోటీనిస్తుందనేది ఆసక్తి రేపుతున్నది.
చిత్రాలు.. ప్రాక్టీస్ సెషన్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు
*శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే