క్రీడాభూమి

షమీ సునామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్: రోజ్ బౌల్ స్టేడియంలో శనివారం జరిగిన వరల్డ్ గ్రూప్ మ్యాచ్‌లో బలమైన టీమిండియాను ‘పసికూన’ అఫ్గానిస్తాన్ దాదాపుగా ఓడించినంత పని చేసింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందంటూ చెప్పుకొనే భారత్‌ను 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం లక్ష్య సాధనకు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ చివరి వరకూ పోరాటం సాగించారు. అయితే భారత పేసర్ మహమ్మద్ షమీ చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించి అఫ్గాన్‌ను దెబ్బ తీశాడు. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ మరోసారి భారీ స్కోరు సాధిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ముజీబుర్ రహ్మాన్ బౌలింగ్‌లో లేట్ స్పిన్‌ను అంచనా వేయడంలో రోహిత్ విఫలమయ్యాడు. ఫుట్‌వర్క్ సైతం అతని బద్దకానికి అద్దం పట్టింది. ఫలితంగా బంతి రోహిత్‌ను బీట్ చేసి, ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. కేవలం ఒక పరుగు చేసిన అతను నిరాశగా వెనుదిరిగాడు. లోకేష్ రాహుల్ అసలు ఫామ్‌లోనే లేనట్టు ఆడాడు. మహమ్మద్ నబీ బౌలింగ్‌లో పైకి ఎగసి వస్తున్న బంతిని బ్యాట్స్‌మన్ ఎవరైనా రక్షణాత్మకంగా ఆడతాడు. కానీ రాహుల్ అందుకు భిన్నంగా రివర్డ్ స్వీప్ కోసం ప్రయత్నించి, హజ్రతుల్లా జజాయ్‌కి సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 30 పరుగులు చేయడానికి 53 బంతులు ఆడడం క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి అతను ఎంతగా గందరగోళపడ్డాడో స్పష్టమవుతుంది. ఆల్‌రౌండ ర్ విజయ్ శంకర్‌ను రహ్మత్ షా ఔట్ చేశాడనేకంటే, తనంతట తానే ఔటయ్యాడనడం సబబుగా ఉంటుంది. రహ్మత్ షా వేసిన అత్యంత సాదాసీదా బంతిని ఆడలేక అతను తడబడ్డాడు. ఫుట్‌వర్క్ కూడా సరిగ్గా లేదు. బ్యాట్‌ను, ప్యాడ్స్‌ను ఒకే సరళరేఖలోకి తీసుకు రావడంలో విఫలమై ఎల్‌బీగా వెనుదిరిగాడు. ఫామ్‌ను కోల్పోయిన విధంగా అత్యంత నిదానంగా ఆడిన అతను 41 బంతుల్లో 29 పరుగులు చేయగలిగాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను సాధించడం బౌలర్ మహమ్మద్ నబీని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. షార్ట్ పిచ్ బంతిని కట్ షాట్‌గా మార్చడానికి ప్రయత్నించిన కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. బ్యాట్ అంచులకు తగిలిన బంతి నేరుగా షార్ట్ థర్డ్ మన్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ సిద్ధంగా ఉన్న రహ్మత్ షా డైవ్ క్యాచ్ పట్టడంతో కోహ్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకు ముందు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా వనే్డ కెరీర్‌లో 52వ అర్ధ శతకాన్ని సాధించిన కోహ్లీ మొత్తం మీద 63 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. సెంచరీని నమోదు చేసే ఊపుమీద కనిపించిన అతను కూడా నిర్లక్ష్యమైన షాట్ కొట్టి, వికెట్‌ను పారేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా అఫ్గానిస్తాన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడడం ఆశ్చర్యం కలిగించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ‘మిస్టర్ కూల్’గా పేరు తెచ్చుకున్న ధోనీ ఒత్తిడిలో ఆడినట్టు కనిపించింది. 52 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసిన అతను రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్రీజ్ నుంచి అనవసరంగా బయటకు వచ్చి, భారీ షాట్‌కు ప్రయత్నించి ఇక్రం అలీ ఖిల్ స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. 192 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్‌ను చేజార్చుకుంది. అల్తాబ్ ఆలం బౌలింగ్‌లో కేదార్ జాదవ్ భారీ సిక్స్ కొట్టడంతో, 46వ ఓవర్ ఐదో బంతిలో భారత్ స్కోరు 200 పరుగుల మైలురాయిని అధిగమించింది.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఏడు పరుగులకే ఔటయ్యాడు. అఫ్తాబ్ ఆలం బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా ఆడిన అతను వికెట్‌కీపర్ ఇక్రం అలీ ఖిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అతను ఆ బంతిని వదిలేస్తే వైడ్ అయ్యేది. కానీ, దానిని వెంటాడి మరీ పాండ్య వికెట్‌ను సమర్పించుకున్నాడు. గుల్బదీన్ నరుూబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మహమ్మద్ షమీ (1)ని, కేదార్ జాదవ్ (52)ను బౌల్డ్ చేశాడు. షమీ క్లీన్ బౌల్డ్‌కాగా, 68 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాధించిన జాదవ్ చివరికి సబ్‌స్టిట్యూట్ ఆటగాడు నూర్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 224 పరుగులు చేసింది. అప్పటికి కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా చెరొ క పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు.
భారత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అఫ్గానిస్తాన్ 20 పరుగుల స్కోరువద్ద హజ్మతుల్లా జజాయ్ వికెట్‌ను చేజార్చుకుంది. 10 పరుగులు చేసిన అతనిని మహమ్మద్ షమీ ఒక చక్కని యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. సాధించాల్సిన రన్‌రేట్ పెద్దగా లేకపోవడంతో, కెప్టెన్ గుల్బదీన్ నరుూబ్, రహ్మత్ షా జాగ్రత్తగా, ఆచితూచి ఆడారు. వికెట్ కూలితే ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో, రక్షణాత్మక విధానానికే ప్రాధాన్యం ఇచ్చారు. వీరు బలపడుతున్నారన్న అనుమానంతో స్పిన్ నుంచి పేస్‌కు బౌలింగ్‌ను మార్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వికెట్ రాబట్టాడు. హార్దిక్ పాండ్య తన రెండో స్పెల్ ఐదో బంతికి, విజయ్ శంకర్ క్యాచ్ అందుకోగా, 27 పరుగులు చేసిన గుల్బదీన్ వికెట్ సాధించాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హస్మతుల్లా షాహీదీ కూడా వికెట్ కూలకూడదనే ఉద్దేశంతోనే ఆటను కొనసాగించాడు. ఇన్నింగ్స్‌లో 27 ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్, మూడో బంతిలో సింగిల్ తీయడం ద్వారా రహ్మత్ షా జట్టు స్కోరును వంద పరుగులకు చేర్చాడు. తర్వాత కొద్ది సేపటికే రహ్మత్ షా వికెట్ పడింది. 63 బంతుల్లో 36 పరుగులు చేసిన అతను జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో యుజువేంద్ర చాహల్‌కు దొరికాడు. అదే ఓవర్ చివరి బంతికి హస్మతుల్లా షాహీదీ వికెట్‌ను కూడా జస్‌ప్రీత్ బుమ్రా సాధించాడు. 45 బంతుల్లో 21 పరుగులు చేసిన అతనిని రిటర్న్ క్యాచ్ తీసుకొని వెనక్కు పంపాడు. వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ రన్‌రేట్‌ను రాబట్టడంతో అఫ్గాన్ క్రికెటర్లు విఫలమయ్యారు. అస్గర్ అఫ్గాన్ (8)ను యుజువేంద్ర చాహల్ క్లీన్ బౌల్డ్ చేసి, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. అయితే, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ కాంబినేషన్‌లో అఫ్గాన్ ఆశలు చిగురించాయి. వారి వ్యూహాత్మక బ్యాటింగ్ భారత్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. నజీబుల్లా జద్రాన్ (21)ను యుజువేంద్ర చాహల్ క్యాచ్ అందుకోగా, హార్దిక్ పాండ్య ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ భారత్ వైపు మొగ్గుచూపింది. యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఓ ఫోర్ కొట్టిన రషీద్ ఖాన్ తర్వాతి బంతిని కూడా అదే తీరుగా ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ధోనీ స్టంప్ చేయగా ఔటైన అతను 14 పరుగులు చేశాడు. చివరి వరకు భారత్‌ను టెన్షన్‌కు గురిచేసిన మహమ్మద్ నబీ (52) అర్ధ సెంచరీ సాధించిన అనంతరం షమీ బౌలింగ్‌లో హార్దిక్‌పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత బంతికే అఫ్తాబ్ ఆలమ్ (0)ను కూడా షమీ బౌల్డ్ చేశాడు. తరువాత వచ్చిన ముజిబ్ ఉర్ రహమన్ (0) కూడా బౌల్డ్ చేసిన షమీ ఈ మెగా టోర్నీలో మొదటి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.

చిత్రాలు.. హ్యాట్రిక్ సాధించిన మహమ్మద్ షమీకి రోహిత్ శర్మ అభినందన
*విరాట్ కోహ్లీ (67)