క్రీడాభూమి

న్యూజిలాండ్‌దే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 23: ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కివీస్‌నే విజయం వరించింది. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ముందుగా గెలిచిన వెస్టిండీస్ జట్టు న్యూజి లాం డ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లిద్దరినీ షెల్డన్ కాట్రెల్ గోల్డెన్ డక్‌గా పెలియన్ పంపించా డు. అయతే కెప్టెన్ విలియమ్సన్ (148), సీనియర్ బ్యాట్ సమన్ రాస్ టేలర్ (69) మరెవ్వరూ రాణించక పోవడంతో న్యూజి లాండ్ నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయ 291 పరుగులను చేసింది. విండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్‌కు 4 వికెట్లు దక్కగా, కార్లోస్ బ్రాత్ వైట్ 2, క్రిస్ గేల్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు షై హోప్ (1), నికోలస్ పూరన్ (1) వికెట్లను కోల్పోయంది. మరో ఓపెనర్ క్రిస్‌గేల్ (87) , షీమ్రాన్ హెట్మయర్ (54) అర్ధ సెంచరీలతో రాణించారు.
బ్రాత్‌వైట్ విజృంభణ..
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మిడిలార్డర్ బ్యాట్స్ మన్, ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ సెంచరీ సాధించాడు. అయతే మరో ఓవర్ మిగిలి ఉండగానే జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో బ్రాత్ వైట్ కావడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో వెస్టిండీస్ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది.

చిత్రం... విండీస్ బ్యాట్స్‌మన్ కార్లోస్ బ్రాత్‌వైట్ ను ఓదారుస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు