క్రీడాభూమి

మళ్లీ ఓడిన సఫారీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 23: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టా స్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచు కుంది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హాక్, ఫఖర్ జమాన్ ఇన్నింగ్స్ ప్రారంభించగా, ఫఖర్ (44)ను తాహీర్ అవుట్ చేశాడు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 81 పరుగుల భాగస్వా మ్యాన్ని అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజమ్‌తో కలిసి ఇమామ్ సఫారీ బౌలింగ్‌పై చెలరేగాడు. అయతే కొద్దిసేపట్లోనే ఇమామ్ ఉల్ హాక్ (44)ను తాహీర్ రిటర్న్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ హఫీజ్ (20) నిరాశ పరచగా, హరీస్ సో హైల్‌తో కలిసి బాబర్ (69) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ దశలో అర్ధ సెం చరీ పూర్తిచేసుకున్న తర్వాత భారీ షాట్‌కు యత్నించి ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో లుంగీ ఎంగిడి చేతికి చిక్కాడు. మరోవైపు ఇమాద్ వసీం (23), వాహబ్ రియాజ్ (4) వెంట వెంటనే అవుట్ కాగా, హరీస్ సోహైల్ (89) సెంచరీకి చెరువలో వెనుదిరిగాడు. ఆ తర్వా త కెప్టెన్ సర్ఫరాజ్ అహమ్మద్ (2, నాటౌట్), షాదాబ్ ఖాన్ (1, నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండడంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడికి 3 వికెట్లు దక్కగా, ఇమ్రాన్ తాహీర్‌కు 2, ఫెహ్లుక్వాయో, అయడెన్ మార్కరంలు చెరో వికెట్ తీసుకున్నారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ..
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలకు ఆదిలోనే ఓపెనర్ హషీమ్ ఆమ్లా (2) వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ (47) ఫర్వాలే దనిపించగా, కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (63) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరి తర్వాత అయ డెన్ మర్కరం (7) విఫలమవ్వగా, రస్సె వన్ డర్ డుస్సెన్ (36), డేవిడ్ మిల్లర్ (31), మిడిలార్డర్‌లో ఫర్వాలేదనిపించారు. అయ తే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు క్రిస్ మోరిస్ (16), కగిసో రబద (3), లుంగీ ఎంగిడి (1) దారుణంగా విఫలం కాగా, ఇమ్రాన్ తాహీర్ (1, నాటౌట్), చివర్లో అండిలె ఫెహ్లుక్వాయో (46, నాటౌట్) పోరాడినా జట్టును గెలిపిం చలే కపోవడంతో దక్షిణాఫ్రికా 49 పరుగుల తో పరాజయం పాలైంది. పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్, షాదాబ్ ఖాన్ చెరో మూ డు వికెట్లు తీసుకోగా, మహమ్మద్ అమీర్ 2, షాహీన్ అఫ్రీన్‌కు 1 వికెట్ దక్కింది.
చిత్రం... హరీస్ సోహైల్ (89)