క్రీడాభూమి

నిరాశ పరిచిన ధోనీ, జాదవ్ బ్యాటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 23: అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కేదార్ జాదవ్ బ్యాటింగ్ తీరుపై మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వారి ఆటతీరు తనను నిరాశ పరిచిందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ 34 ఓవర్ల పాటు స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని మనం చేసింది 119 పరుగులు మాత్రమేనన్నారు. కోహ్లీ అవుటైన 38వ ఓవర్ నుంచి 45వ ఓవర్ వరకు పెద్దగా పరుగులేమీ రాబట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిలార్డర్‌పై ఒత్తిడి ఉండడం సహజమేనని, కానీ దానిని అధిగమించి ఆడాలని సూచించాడు. ఒకరకంగా ఆ స్థానంలో వేరెవరైనా ఉంటే బాగుండేమోననిపిస్తోం దని మాస్టర్ బ్లాస్టర్ వెల్లడించడం గమనార్హం.