క్రీడాభూమి

షకీబ్ ఆల్‌రౌండ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 24: షకీబ్ అల్ హసన్ ఆల్ రౌండ్ ప్రతిభ సోమవారం ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు 62 పరుగుల విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 262 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా అఫ్గాన్ 47 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అర్ధ శతకం సాధించిన షకీబ్ బౌలింగ్‌లోనూ రాణించి, 29 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి, బంగ్లాను విజయపథంలో నడిపాడు.
టాస్ గెలిచి అఫ్గాన్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు సాధించింది. చివరిలో నాటౌట్‌గా నిలిచిన మహమ్మద్ సైఫుద్దీన్ (2) తప్ప మిగతా వారంతా కనీసం రెండంకెల స్కోర్లు చేయడం విశేషం. షకీబ్ అల్ హసన్ మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, 51 పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తమీమ్ ఇక్బాల్ 36, మోసాడెక్ హొస్సేన్ 35 పరుగులతో బంగ్లాను ఆదుకున్నారు. ముబుర్ రహ్మాన్ 39 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ గుల్బదీన్ నరుూబ్ 56 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. దౌలత్ జద్రాన్, మహమ్మద్ నబీ చెరో వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.
అనంతరం అఫ్గాన్ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే, 200 పరుగులకు ఆలౌటైంది. గుల్బదీన్ నరుూబ్ 47, సమీయుల్లా షిన్వారీ 49 (నాటౌట్), మజీబుల్లా జద్రాన్ (23), రహ్మత్ షా (24) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. షకీబ్ ఐదు వికెట్లు పడగొట్టగా, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 32 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. ఇలావుంటే అఫ్గానిస్తాన్‌ను ఓడించినంత మాత్రాన బంగ్లాదేశ్‌కు సెమీస్‌లో చోటు దక్కుతుందని అనుకోవడానికి వీల్లేదు. అందు కోసం ఆ జట్టు మిగతా మూడు మ్యాచ్‌లను కూడా గెల్చుకోవడాలి. అంతేగాక, భారీ తేడాతో ప్రత్యర్థులను ఓడించాడు. అప్పటికీ బంగ్లాకు సెమీస్ అవకాశం అంత సులభంగా లభించదు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమతమ మిగిలిన అన్ని గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్ని చవిచూడాలి. భారత్ మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరి మూడు మ్యాచ్‌లు ఆడాలి. ఈ మూడు జట్లూ ఘోరంగా ఓడితేనే బంగ్లాకు సెమీస్ అవకాశం ఉంటుంది. సాంకేతికంగా ఆ జట్టు ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి ప్రకారం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్టే భావించాలి.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 (తమీమ్ ఇక్బాల్ 36, షకీబ్ అల్ హసన్ 51, ముష్ఫికర్ రహీం 83, మొసాడెక్ హొస్సేన్ 35, మహమ్మదుల్లా 27, ముజీబుర్ రహ్మాన్ 3/39, గుల్బదీన్ నరుూబ్ 2/56).
అఫ్గానిస్తాన్: 47 ఓవర్లలో ఆలౌట్ 200 (గుల్బదీన్ నరుూబ్ 47, రహ్మత్ షా 24, సమీయుల్లా షిన్వారీ 49 నాటౌట్, నజీబుల్లా జద్రాన్ 23, షకీబ్ అల్ హసన్ 5/29, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/32).

చిత్రం...ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షకీబ్ అల్ హసన్