క్రీడాభూమి

టోర్నీకి ముందే మాటల యుద్ధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 24: మెగా టోర్నీకి ముందే ఆస్ట్రేలి యా జట్టుపై ఇంగ్లాండ్ విమర్శలు మొదలు పెట్టింది. ఇంగ్లాండ్ క్రికెట్‌కు సంబంధించిన బార్మీ ఆర్మీ ట్విట్టర్ పేజీలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఉద్దేశిస్తూ విమర్శల దాడి మొదలు పెట్టింది. ముఖ్యం గా బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కొని నిషేధం ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్‌ను టార్గెట్ చేశారు. అక్కడితో ఆగకుండా వార్నర్ వేసుకున్న జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా ‘చీట్స్’ అని రాసి పోస్ట్ చేశారు. వార్నర్‌తో పాటు మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లియాన్ చేతుల్లో సాండ్ పేపర్ పట్టుకు న్నట్లు పొటోలను మార్ఫింగ్ చేసి ఆస్ట్రేలియా కొత్త జెర్సీని విడుదల చేసిందంటూ కామెంట్ చేశాయ. అయతే అప్పట్లో ఈ వివాదంపై స్పందించిన ఆసీస్ కోచ్ లాంగర్ ప్రపంచ కప్‌లో మా సత్తా చాటు తాం అంటూ బదులిచ్చాడు.