క్రీడాభూమి

నువ్వా.. నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మెగా టోర్నీలో మరో రసవత్తర మ్యాచ్‌కు తెరలేవనుంది. లండన్ వేదికగా ఆతిథ్య జట్టు తన చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనుం ది. టోర్నీకి ముందునుంచే మాటల యుద్ధం మొదల వడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది. ఇప్పటి కే ఐదు సార్లు ప్రపంచకప్, రెండు సార్లు రన్నరప్‌గా నిలిచి డిఫెండింగ్ చాంపియన్‌గా మెగా టోర్నీలో అడు గుపెట్టిన కంగారూలు వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ప్రపంచకప్‌ని ముద్దాడని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కి ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగబోతుందనేది ఆసక్తిగా మారింది.
నాలుగు విజయాలతో..
ఆతిథ్య హోదాలో మెగా టోర్నీని ప్రారంభించిన ఇంగ్లాడ్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించి, మరో రెండిటా పరాజ యం పాలైంది. ఆస్ట్రేలియా వంటి చిరకాల ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు ఓటమిని జీర్ణిం చుకోలేకపోతుంది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఓడించి టోర్నీలో బోణీ కొట్టినా, పాక్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 14 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ జట్లపై గెలిచి సొంత మైదానాల్లో తమకు తిరుగులేద ని చాటింది. కానీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ని చిన్న చిన్న పొరపాట్లతో చేజార్చుకుంది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో రెండో పరాజయాన్ని మూట గట్టుకుంది.
జోరుమీదున్న ఆటగాళ్లు..
టోర్నీలో హాట్ ఫెవరిట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాం డ్ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అదగొ డుతోంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు జానీ బెయర్ స్టో, జోస్ బట్లర్, జో రూట్ బెన్ స్టోక్స్ వంటి బ్యాట్స్‌మెన్లతో బ్యాటింగ్ విభాగం బలంగా ఉండగా, బౌలింగ్‌లో క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ వంటి హేమా హేమీలున్నారు.
వార్నర్‌తో డేంజర్..
ఇంగ్లాండ్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే మెగా టోర్నీలో 6 మ్యాచులాడిన వార్నర్ 89.40 సగటుతో 447 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. ఇందులో సెం చరీలుండడం విశేషం. వార్నర్‌తో పాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఇంగ్లీష్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారే అవకాశముంది.
కంగారూలకు బ్యాటింగే బలం..
ఏమాత్రం అంచనాల్లేకుండా డిఫెండింగ్ చాంపియ న్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్ వంటి టోర్నీలో తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటా ఘన విజయం సాధించి, పాయంట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. భార త్‌తో జరిగిన మ్యాచ్ మినహా అఫ్గానిస్తాన్, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై ఘన విజయం సాధించి మరోసారి టోర్నీని ముద్దాడాలని ఉవ్వి ళ్లూరుతోంది. ముఖ్యంగా జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌తో పాటు ఉస్మాన్ ఖాజా, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి హిట్టర్లుండడం కంగా రూలకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్‌లో యార్కర్ స్పెషలిస్ట్ మిచెల్ స్టార్క్‌తో పాటు ప్యాట్ కమ్మిన్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, నాథన కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయనిస్, ఆడం జంపా వంటి బౌలర్లతో ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉంది.
బ్యాట్‌తోనే బదులు..
తనపై ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు ఎన్ని విమర్శలు చేసినా హమ్ బుల్ (డేవిడ్ వార్నర్) మాత్రం వాటిని పట్టించుకోకుండా బ్యాటింగ్‌పైనే దృష్టి సారిం చి, టాప్‌లో కొనసాగుతున్నాడు. అయతే ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వార్నర్ ఎలా ఆడతాడో చూడాలి.
ఇంగ్లాండ్ రెండుసార్లే..
ప్రపంచకప్ టోర్నీల్లో ఇరుజట్లు ఇప్పటివరకు 7 మ్యాచుల్లో తలపడగా, ఇంగ్లాండ్ జట్టు (1979, 1992) కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించగా, ఆస్ట్రేలియా (1975, 1987, 2003, 2007, 2015) ఐదు సార్లు గెలుపొందింది. ఆసీస్ అత్యధికంగా 342, అత్యల్పంగా 94 స్కోరు చేయగా, ఇంగ్లాండ్ అత్యధి కంగా 247, అత్యల్పంగా 93 స్కోరు చేసింది.
ప్రాక్టీస్ సెషన్‌లో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్

చిత్రాలు.. ప్రాక్టీస్ సెషన్‌లో జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
*నెట్ ప్రాక్టీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు