క్రీడాభూమి

కివీస్‌ను నిలువరించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌తో బుధ వారం పాకిస్తాన్ తలపడనుంది. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే గెలిచిన పాక్, ఓటమే ఎరగని కివీస్‌ని ఏ విధంగా నిలువరిస్తుందోనని అభిమా నులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత చరిత్ర చూస్తే ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్ జట్టే పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇరు జట్లు మొత్తం 8 మ్యాచుల్లో పోటీపడగా పాకిస్తాన్ 6, న్యూజిలాండ్ 2 విజ యాలు సాధించాయి. ఈ రెండు జట్టు చివరి సారిగా 2011 ప్రపంచకప్‌లో తలపడగా కివీస్‌నే విజ యం వరించింది.
జోరుమీదున్న కివీస్..
గత ప్రపంచకప్‌ను త్రుటిలో కోల్పోయన న్యూ జిలాండ్ జట్టు ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయకుం డా టోర్నీలో విజయవంతంగా ముందుకెళ్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిం డీస్‌తో జరిగిన మ్యాచుల్లో ఆటగాళ్లు అసాధారణ ప్రతిభతో జట్టు ను గెలిపించారు. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయినా పాయిం ట్ల పట్టికలో న్యూజిలాండ్ 11 పాయంట్లతో మొదటి స్థానంలో ఉంది.
అంతా తానై..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతా తానై జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. గత మ్యాచుల్లో ఓపెనర్లు విఫలమైనా ఒంటి చేత్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరివరకు క్రీజులో ఉండి ఆడిన తీరు అద్భుతం. మరో సీనియర్ ఆటగాడు రాస్ టేలరై సైతం కరేబి యాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లంతా విఫలం కాగా, కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి దాదాపు 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని అందించాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రో రాణిస్తే పాక్‌తో జరిగే మ్యాచ్‌లో సులువుగా విజయాన్ని అందుకోవ చ్చు. మరోవైపు బౌలింగ్ విభాగం కూడా ఫామ్‌లో ఉండడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం.
ఎప్పుడెలా ఆడతారో..
ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టును అంచనా వేయడం చాలా కష్టం. ఎప్పుడెలా ఆడుతుందో తెలియ ని పరిస్థితి. మెగా టోర్నీలో సైతం పాక్ ఇదే తరహా ఆడుతోంది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే విండీస్ చేతి లో ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై గెలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడం పాక్ జట్టుకు పెద్ద దెబ్బే. అ యతే ఆస్ట్రేలియా, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో పరాజయం పాల వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా భారత్ వంటి చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమిని ఆ దేశ అభిమానులు సైతం జీర్ణించుకోలేదు. ఆ తర్వాత జట్టులో విభేదాలు సైతం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను మానసికంగా దెబ్బతీశాయనే చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆ టగాళ్లంతా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయమిచ్చిన ఆత్మస్థైర్యంతో న్యూజిలాండ్‌పై విజ యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే రానున్న మ్యాచుల్లో విజయం తప్పనిసరైంది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్, వాహబ్ రియాజ్ లు రాణించడం జట్టుకు బలంగా మారగా, బ్యాటింగ్ వైఫల్యమే జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారుతోంది.

చిత్రాలు..బర్మింగ్‌హామ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్
*నెట్స్‌లో సాధన చేస్తున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, జట్టు ఆటగాళ్లు