క్రీడాభూమి

నిలకడగా బల్బీర్ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 27: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భారత మాజీ హాకీ స్టార్ బల్బీర్ సింగ్ సీనియర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. మూడు పర్యాయాలు ఒలింపిక్ స్వర్ణ పతకాలను సాధించిన 94 ఏళ్ల బల్బీర్‌ను అనారోగ్యం కారణంగా ఇక్కడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో చేర్చారు. ఈ ఏడాది జనవరిలోనూ అతనిని న్యుమోనియా కారణంగా సుపత్రిలో చేర్చారు. 108 రోజుల తర్వాత ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్జార్జి అయ్యారు. మరోసారి అలాంటి సమస్యతోనే బల్బీర్ సింగ్‌ను ఆసుపత్రిలో చేర్చినట్టు ఆయన మనవడు కబీర్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారని అన్నాడు. బల్బీర్ సింగ్ త్వరలోనే కోలుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసీ) ప్రకటించి ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ 16 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయుడు బల్బీర్ సింగ్ సీనియర్. ఒక ఒలింపిక్స్ పురుషుల ఫైనల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అతను నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. 1952 హెల్సిన్కీ ఒలింపిక్స్ పురుషుల ఫైనల్లో నెదర్లాండ్స్‌ను భారత్ 6-1 తేడాతో చిత్తుచేసింది. ఆ మ్యాచ్‌లో బల్బీర్ సింగ్ ఒక్కడే ఐదు గోల్స్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఒలింపిక్స్ ఫైనల్లో ఇంత వరకూ మరే ఇతర ఆటగాడూ ఇంత వరకూ ఇన్ని గోల్స్ చేయలేదు. హెల్సిన్కీతోపాటు 1948 లండన్, 1956లో మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ బల్బీర్ సింగ్ ఆడాడు. ఈ మూడు పర్యాయాలు భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. 1975లో ప్రపంచ కప్‌ను సాధించిన భారత జట్టుకు ఆయన మేనేజర్‌గా వ్యవహరించాడు. 1957లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.