క్రీడాభూమి

బ్రాత్‌వెయిట్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 28: అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లొస్ బ్రాత్‌వెయిట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశించింది. భారత్‌తో గురువారం జరిగిన మ్యాచ్ 42వ ఓవర్‌లో బ్రాత్‌వెయిట్ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన బ్రాత్‌వెయిట్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్‌ను దుర్భాషలాడకపోయినా, అలాంటి ప్రవర్తనతో అసంతృప్తి ప్రకటించాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, థర్డ్ అంపైర్ మైఖేల్ గాఫ్, ఫోర్త్ అంపైర్ అలీమ్ దార్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. అతనికి కనీసం 50 మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించాలని, రెండు డీమెరిట్ పాయింట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ వివాదాన్ని విచారించిన ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడు క్రిస్ బ్రాడ్ పొరపాటును అంగీకరించి, బేషరతుగా క్షమాపణ చెప్తే శిక్ష తగ్గుతుందని బ్రాత్‌వెయిట్‌కు సూచించాడు. అందుకు అతను అంగీకరించడంతో, శిక్షను తగ్గించాడు. మ్యాచ్ ఫీజులో 15 శాతాన్ని జరిమానాగా విధించాడు. ఒక డీమెరిట్ పాయింట్‌ను ఇచ్చాడు. 2016 సెప్టెంబర్‌లో ఐసీసీ తొలిసారి ఈ డీమెరిట్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో పాయింట్లు చేరుతున్న కొద్దీ, ఆటగాళ్లకు విధించే శిక్ష కఠినంగా మారుతూ ఉంటుంది. కాగా, ఈనెల 14న ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు తొలిసారి బ్రాత్‌వెయిట్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. తాజాగా అతని ఖాతాలో మరో పాయింట్ చేరింది.