క్రీడాభూమి

నేడు ఆసీస్, కివీస్ ఆధిపత్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 28: వరల్డ్ కప్‌లో శనివారం డే/నైట్ మ్యాచ్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారికంగా సెమీ ఫైనల్స్ చేరుకోగా, న్యూజిలాండ్ తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‌లు ఆడి, ఆరు విజయాలను నమోదు చేసింది. ఒక మ్యాచ్‌ని చేజార్చుకుంది. కివీస్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించింది. ఒక పరాజయాన్ని చవిచూసింది. భారత్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆసీస్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో గెలిస్తే, ఈ జట్టు కూడా అధికారికంగా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. ఓడినా, ఆ జట్టు చేతిలో మరో మ్యాచ్ మిగిలే ఉంటుంది. అందుకే, ఈ మ్యాచ్‌ని ఆసీస్‌పై ఆధిపత్యాన్ని కనబరచేందుకు లభించిన అవకాశంగా న్యూజిలాండ్ భావిస్తున్నది.