క్రీడాభూమి

సెమీస్‌పై పాక్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూన్ 28: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్స్‌పై పాకిస్తాన్ కనే్నసింది. అఫ్గానిస్తాన్‌తో శనివారం జరిగే గ్రూప్ మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధమైంది. నిజానికి ఈ మ్యాచ్ గెలిచినంత మాత్రాన పాక్ జట్టు సెమీస్ చేరుతుందని అనుకోవడానికి వీల్లేదు. అయితే, సాంకేతికంగా మాత్రం ఆశలు సజీవంగానే ఉంటాయి. మిగతా జట్ల జయాపజయాలు, రన్‌రేట్ వంటి అనేకాకనేక అంశాలపై కూడా పాక్ ఆధారపడాల్సి ఉంటుంది. అంతేగాక, అఫ్గాన్‌ను ఓడించి, ఆతర్వాత జూలై ఆరున బంగ్లాదేశ్‌పైనా నెగ్గితేనే సెమీస్‌లో స్థానాన్ని కొంతవరకైనా ఆశించవచ్చు. కాగా, వరుస పరాజయాలతో అల్లాడిన పాకిస్తన్ గత రెండు మ్యాచ్‌ల్లో ఎదురుదాడికి దిగి, అద్భుత విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికాను 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి, 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 308 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును నమోదు చేసింది. హారిస్ సొహైల్ 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బాబర్ ఆజమ్ 69 పరుగులు సాధించి, పాక్‌కుమెరుగైన స్కోరును అందించడంలో సహకరించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు చేజార్చుకొని 259 పరుగులు చేయగలిగింది. ఆ మ్యాచ్‌తో ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో, ఆతర్వాత న్యూజిలాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. కివీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 241 పరుగులు చేసింది. అనంతరం పాక్ తన లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బాబర్ ఆజమ్ మరోసారి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, పాక్ విజయంలో కీలక భూమిక పోషించాడు. రెండు వరుస విజయాలతో జోరుమీద ఉన్న పాకిస్తాన్‌కు అఫ్గాన్‌ను ఓడించడం కష్టం కాకపోవచ్చు.
పోరాట యోధులు..
అఫ్గాన్ క్రికెటర్లను పోరాట యోధులుగా పేర్కోవాలి. టైటిల్ ఫేవరిట్స్‌లో ఒకటైన టీమిండియాకు గత మ్యాచ్‌లో అఫ్గాన్ చుక్కలు చూపించిన విషయాన్ని క్రికెట్ అభిమానులు ఎవరూ మరచిపోలేదు. అతి కష్టం మీద భారత్ గెలిచింది. నైతిక విజయం మాత్రం అఫ్గాన్‌కే దక్కింది. ఈ జట్టు ఇంత వరకూ ఏడు మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ పరాజయాలను చవిచూసినప్పటికీ, ప్రతి మ్యాచ్‌లోనూ పోరాటం సాగించిందన్న ప్రశంసలను అందుకుంది. శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది వాస్తవం. అయితే, అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించుకో తప్పదు. గతంలో పాక్‌ను ఓడించిన రికార్డు అఫ్గాన్‌కు ఉందనే విషయాన్ని మరచిపోకూడదు.

అభిమానులే మా బలం

కరాచీ, జూన్ 28: అభిమానులే తమ బలమని, వారి అండతోనే ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మళ్లీ ఫామ్‌లోకి రాగలిగామని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. అయితే, కొంత మంది అభిమానుల మితిమీరిన చేష్టలు బాధ కలిగిస్తాయని చెప్పాడు. తనను పందితో పోలుస్తూ, ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను చూసి తన భార్య కుష్బక్త్ రోదించిందని ‘జంగ్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ తెలిపాడు. తన కుమారుడు అబ్దుల్లాను ఎత్తుకొని, భార్యతోసహా బయటకు వెళ్లినప్పుడు ఓ క్రికెట్ అభిమాని తనను పందితో పోలుస్తూ, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు. ఆ అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను చూసి తన భార్య కన్నీళ్లు పెట్టుకుందని, ఇలాంటి పరిస్థితులు సహజంగానే బాధ కలిగిస్తాయని అన్నాడు. అయితే, ఎక్కువ మంది అభిమానులు తమకు అండగా ఉంటున్నారని, అందుకే ప్రపంచ కప్‌లో మళ్లీ ఫామ్‌లోకి రాగలిగామని సర్ఫరాజ్ అన్నాడు. ‘అభిమానులే మా బలం. అభిమానుల బాధ ను నేను అర్థం చేసుకోగలను. వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో మేము ఓడినప్పుడు, వారి ఆగ్రహాన్ని, ఆవేదనను జట్టులోని ప్రతి ఒక్కరూ గ్రహించారు. అయితే, మ్యాచ్‌లో మా ప్రదర్శనతో ఆగకుండా, వ్యక్తిగత విమర్శలకు దిగేవారు కూడా ఉన్నారు. అలాంటి వారు కొం చెం నిధానంగా ఆలోచిస్తే మంచిది. మమ్మల్ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని చేసే విమర్శలు మనసును బాధపెడతాయి. కానీ, స్థూలంగా చూస్తే మాత్రం అభిమానుల అండతోనే క్రీడాకారులు రాణించగలుగుతా రు’ అన్నాడు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ సంఖ్యలో అభిమానులు హాజరై, జట్టుకు మద్దతునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. భారత్ చేతిలో ఓడినప్పుడు విమర్శించిన అభిమానులే, మిగతా మ్యాచ్‌ల్లో జట్టుకు అండగా నిలుస్తున్నారని సర్ఫరాజ్ తెలిపాడు. వారి మద్దతు నేపథ్యంలో, రెట్టించిన ఉత్సాహంతో ఆడతామని, వరల్డ్ కప్‌లో మిగతా మ్యాచ్‌ల్లోనూ విజయభేరి మోగించే ప్రయత్నం చేస్తామని సర్ఫరాజ్ అన్నాడు.
కోహ్లీతో పోల్చతగ్గ క్రికెటర్ బాబర్..
బాబర్ ఆజమ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చవచ్చని, అతను ఆ స్థాయి క్రికెటరని పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ వ్యాఖ్యానించాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ గెలవడానికి అతని బ్యాటింగ్ ప్రతిభే కారణమనడంలో సందేహం లేదన్నాడు. ‘బాబర్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. పాక్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరే అవకాశం ఉంది. యువకుడు కాబట్టి అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. రాణించాలన్న పట్టుదల, పరుగులు సాధించాలన్న తపన అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నది. కోహ్లీలోని లక్షణాలు బాబర్‌లోనూ ఉన్నాయి. క్రికెటర్‌గా అతడిని కోహ్లీతో పోల్చడంలో తప్పులేదు’ అన్నాడు. 238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఒకానొద దశలో 110 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, బాబర్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడడమేగాక, అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈవిషయాన్ని గ్రాంట్ ఫ్లవర్ ప్రస్తావిస్తూ, బాబర్ పట్టుదలకు ఈ ఇన్నింగ్స్ ఓ నిదర్శనమని అన్నాడు. వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 3,000 పరుగుల మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్‌లో పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా బాబర్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన విషయాన్ని కూడా గ్రాంట్ ఫ్లవర్ గుర్తుచేశాడు. బాబర్ 68 ఇన్నింగ్స్‌లో 3వేల పరుగులు పూర్తి చేస్తే, కోహ్లీ 75 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరాడు. దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా 57 ఇన్నింగ్స్‌లోనే మూడు వేల పరుగులు పూర్తి చేసి, అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, కోహ్లీతో బాబర్‌ను పోల్చడానికి అతను పరుగులు సాధిస్తున్న తీరే నిదర్శనమని గ్రాంట్ ఫ్లవర్ అన్నాడు. ఉత్తమ భవిష్యత్తు ఉన్న ఈ యువ ఆటగాడు మరెన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంటాడని, అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడని జోస్యం చెప్పాడు.