క్రీడాభూమి

శ్రీలంక ఔట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్టర్ లీ స్ట్రీట్, జూన్ 28: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ నుంచి శ్రీలంక నిష్క్రమణ దాదాపుగా ఖాయమైంది. ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోయిన దక్షిణాఫ్రికా తనకు ఎలాంటి ప్రయోజనం లేని మ్యాచ్‌లో లంకను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసి, ఆ జట్టును కూడా ఇంటిదారి పట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. శుక్రవారం శ్రీలంక తనకు అత్యంత కీలకంగా మారిన దక్షిణాఫ్రికాను ఢీకొని పరాజయాన్ని చవిచూసింది. సెమీస్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. సాంకేతికంగా మాత్రం ఈ జట్టు సెమీస్ చేరడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే, మిగతా రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేగాక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు తలా రెండేసి చొప్పున తాము ఆడాల్సిన మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కోవాలి. అలాంటి పరిస్థితి వస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే, సాంకేతిక అంశాలను పక్కకు ఉంచితే, వరల్డ్ కప్ నుంచి శ్రీలంక నిష్క్రమించిందనే అనుకోవాలి. దక్షిణాఫ్రికాపై 204 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచిన లంక, ఆ స్కోరును పరిరక్షించుకునే ప్రయత్నంలో దారుణంగా విఫలమైంది.
తొలి బంతికే వికెట్
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే కెప్టెన్ దిముత్ కరుణరత్నే వికెట్ కోల్పోయిన శ్రీలంక ఆతర్వాత కోలుకోలేకపోయింది. కుశాల్ పెరెరా, ఆవిష్క ఫెర్నాండో చెరి 30 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారంటే, ఆ జట్టు బ్యాట్స్‌మెన్ వైఫల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయన్న ఒత్తిడి మధ్య లంక ఆడింది. కాగా, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా స్వేచ్ఛగా ఆడింది. లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. డ్వెయిన్ ప్రిటోరియస్ 10 ఓవర్లలో 25 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి, లంకను దారుణంగా దెబ్బతీశాడు. క్రిస్ మోరిస్ 9.3 ఓవర్లలో 46 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. కాగిసో రబదా రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అండెల్ ఫెహ్లుక్వాయో, జీన్‌పాల్ డుమినీ చెరో వికెట్ సాధించారు.
శ్రీలంకను ఓడించేందుకు 204 పరుగులు సాధించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 31 పరుగుల వద్ద తొలి వికెట్‌ను క్వింటన్ డి కాక్ రూపంలో కోల్పోయింది. అతను 15 పరుగులు చేసి, లసిత్ మలింగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఫఫ్ డు ప్లెసిస్ (96 నాటౌట్), హషీం ఆమ్లా (80 నాటౌట్) మరో వికెట్ కూలకుండా, 37.2 ఓవర్లలో జట్టుకు విజయాన్ని అందించారు.
ప్రపంచ కప్ క్రికెట్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔటైన బ్యాట్స్‌మెన్ సరసన శ్రీలంక కెప్టెన్, ఓపెనర్ దిముత్ కరుణరత్నే కూడా చేరాడు. ఈ మెగా టోర్నీ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఇన్నింగ్స్ మొదటి బంతికే పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మన్‌గా బంగ్లాదేశ్ ఓపెనర్ హనన్ సర్కార్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. పీటెర్మరిజ్‌బర్గ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో చామిందా వాస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్, మొదటి బంతికే అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జింబాబ్వే బ్యాట్స్‌మన్ బ్రెండన్ టేలర్ 2011 వరల్డ్ కప్‌లో, నాగపూర్‌లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో ఖుర్రం చొహాన్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిలోనే ఎల్‌బీగా వెనుదిరిగాడు.
నిజానికి సరైన మొదటి బంతికి ఔటైన బ్యాట్స్‌మన్‌గా జాన్ రైట్ పేరును పేర్కోవాలి. 1992 వరల్డ్ కప్‌లో భాగంగా అక్లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను క్రెగ్ మెక్‌డార్మట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే, మెక్‌డార్మట్ వేసిన మొదటి రెండు బంతులు నోబాల్స్. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోలేదు.

స్కోరు బోర్డు..

శ్రీలంక: దిముత్ కరణరత్నే సీ ఫఫ్ డు ప్లెసిస్ బీ కాగిసో రబదా 0, కుశాల్ పెరెరా బీ డ్వెయిన్ ప్రిటోరియస్ 30, ఆవిష్క ఫెర్నాండో సీ ఫఫ్ డు ప్లెసిస్ బీ డ్వెయిన్ ప్రిటోరియస్ 30 కుశాల్ మేండిస్ సీ క్రిస్ మోరిస్ బీ డ్వెయిన్ ప్రిటోరియస్ 23, ఏంజెలో మాథ్యూస్ బీ క్రిస్ మోరిస్ 11, ధనంజయ డి సిల్వ బీ జీన్‌పాల్ డుమినీ 24, జీవన్ మేండిస్ సీ డ్వెయిన్ ప్రిటోరియస్ బీ క్రిస్ మోరిస్ 18, తిసర పెరెరా సీ కాగిసో రబదా బీ అండెల్ ఫెహ్లుక్వాయో 21, సురంగ లక్మల్ 5 నాటౌట్, లసిత్ మలింగ సీ ఫఫ్ డు ప్లెసిస్ బీ క్రిస్ మోరిస్ 4,
ఎక్‌స్ట్రాలు: 20, మొత్తం: (49.3 ఓవర్లలో ఆలౌట్) 203.
వికెట్ల పతనం: 1-0, 2-67, 3-72, 4-100, 5-111, 6-135, 7-163, 8-184, 9-197, 10-203.
బౌలింగ్: కాగిసో రబదా 10-2-36-2, క్రిస్ మోరిస్ 9.3-0-46-3, డ్వెయిన్ ప్రిటోరియస్ 10-2-25-3, అండెల్ ఫెహ్లుక్వాయో 8-0-38-1, ఇమ్రాన్ తాహిర్ 10-0-36-0, జీన్‌పాల్ డుమినీ 2-0-15-1.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ బీ లసిత్ మలింగ 15, ఫఫ్ డు ప్లెసిస్ 96 నాటౌట్, షహీం ఆమ్లా 80 నాటౌట్,
ఎక్‌స్ట్రాలు: 15,
మొత్తం: (37.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206.
వికెట్ల పతనం: 1-31.
బౌలింగ్: లసిత్ మలింగ 10-1-47-1, ధనంజ డి సిల్వ 4-0-18-0, సురంగ లక్మల్ 6-0-47-0, తిసర పెరెరా 5.2-1-28-0, జీవన్ మేండిస్ 7-0-36-0, ఇసురు ఉడానా 5-0-29-0.