క్రీడాభూమి

హమ్మయ్యా.. గెలిచాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూన్ 29: చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై పాక్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్‌కు దిగింది. రహ్మాత్ షా, గుల్బ దిన్ నయబ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మొదటి నుంచే దూకుడు ప్రదర్శించిన ఓపెనర్లు ఓవర్‌కు 6 పరుగులు వచ్చే విధంగా ఆడారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 27 పరుగుల వద్ద గుల్బదిన్ నయబ్ (15) షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన హష్మతుల్లా షాహీది (0) ఎదుర్కొన్న మొ దటి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అనం తరం రహ్మాత్ షా (35)ను ఇమాద్ వసీం అవుట్ చేశాడు. అస్గార్ అఫ్గాన్ (42) ధాటిగా ఆడి షాదా బ్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయా డు. మరో నాలుగు పరుగు ల వ్యవధిలోనే ఇక్రం అలీ ఖిల్ (24) వికెట్ కూడా అఫ్గాన్ కోల్పోయం ది. నజిబుల్లా జద్రా న్ (42) మినహా మరెవ్వరూ రాణించకపోవడంతో అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షా హీన్ అఫ్రిది 4 వికెట్లు తీసుకోగా, ఇమాద్ వసీం, రియా జ్ 2, షాదాబ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు.
తొలి ఓవర్‌లోనే వికెట్..
228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగి లింది. ముజిబ్ వేసిన రెండో బంతికే ఫఖర్ జమా న్ (0) ఎల్‌బీగా అవుటయ్యాడు. ఆ తర్వాత ఇమా మ్ ఉల్ హాక్ (36), బాబర్ ఆజం (45) రాణిం చినా, మహమ్మద్ హఫీజ్ (19), హారిస్ సోహైల్ (17), కెప్టెన్ సర్ఫరాజ్ (18) విఫలమయ్యారు.
ఆదుకున్న వసీం..
చివర్లో ఇమాద్ వసీం అఫ్గా న్ బౌలర్లపై ఎదు రు దాడికి దిగాడు. అఫ్గాన్ కెప్టెన్ గుల్బదిన్ నయ బ్ వేసిన 46వ ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు రాబట్టి జట్టును విజయానికి చేరువ చేశాడు. ఈ దశలో షాదాబ్ ఖాన్ (11) రనౌట్‌గా వెనుదిరిగిన వాహబ్ రియాజ్ (15, నాటౌట్)తో కలిసి జట్టును మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలి పించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రహ్మాన్, మహమ్మద్ నబీ చెరో రెండు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు.