క్రీడాభూమి

నెం.4కు ధోనీయే కరెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 29: భారత జట్టు నాలుగో స్థానంలో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీని ఆడించాలని ఆసీసీ మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న విజయ్‌శంకర్ విఫలమ వుతున్నాడని, ఆ స్థానంలో ధోనీని ఆడిస్తే టీమిండియా మరింత బలపడుతుందని పేర్కొ న్నాడు. అలాగే రవీంద్ర జడేజాను కూడా జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అతడి సేవలను వినియోగించు కోవచ్చని సూచించాడు. నాలుగో స్థానంలో ధోనీతో దినేష్ కార్తీక్‌ను కూడా తీసుకుంటే బాగుంటుదన్నాడు. అయతే భారత జట్టు వరుస విజయాలతో ప్రపంచకప్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నా మిడి లార్డర్ బలహీనంగా ఉందనే చెప్పాలి. వెస్టిండీస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ధోనీ రాణిం చకపోతే పరిస్థితి వేరేగా ఉండేదని అభిమానుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది.