క్రీడాభూమి

కోహ్లీ వికెట్ తీస్తా : మొయిన్ అలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 29: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను తానే తీస్తానంటూ ఇంగ్లాండ్ బౌలర్ మొయిన్ అలీ స్పష్టం చేశాడు. ఈ మేరకు అలీ అలీ ఓ ఆంగ్ల మీడియా బ్లాగులో ఇలా రాసుకొచ్చాడు. ‘భారత జట్టుకు పరు గులు తీసేందుకు తాను ఉన్నానని విరాట్ కోహ్లీకి తెలుసు. అతడిని ఔట్ చేసేందుకు నేనున్నా. అలాం టి గొప్ప ఆటగాడిని ఔట్ చేయడం అంత సులువైన విషయం కాదు’ అని అన్నాడు. అయనా మేమిద్దరం స్నేహితులమే. చిన్నప్పటి నుంచి మిత్రులు, బం ధువులతో కలిసి క్రికెట్ ఆడు తూనే పెరిగాను. అలాగే ఇది కూడా. ఇక్కడ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడమే ముఖ్యంమని పేర్కొన్నాడు.
భారత్‌పైనే ఒత్తిడి..
‘స్వదేశంలో ఆడడం ఒత్తిడికి కారణంగా మారొ ద్దు. ఆదివారం భారత్‌తో మ్యాచ్ ఆడబోతున్నాం. వరుస విజయాలతో దూసుకుపో తున్న భారత జట్టు పై ఉన్నంత ఒత్తిడి మాపై ఉండదు. స్వదేశంలో భార త ఆటగాళ్లు సూపర్ స్టార్లు. గెలిస్తే అభిమానులు ఆ కాశానికి ఎత్తుకుంటారు. ఓడిపోతే మాత్రం దారు ణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిడి కా రణంగా మంచి ప్రదర్శన చేయకపోతే ఆ ఆటగాళ్లు సాధారణ జీవితం గడపలేరు’ అని అన్నాడు.
చిత్రం... స్పిన్ సలహాదారు సక్లయన్ ముస్తాక్‌తో మొయిన్ అలీ, అదిల్ రషీద్