క్రీడాభూమి

గెలవాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్: హాట్ ఫెవరిట్‌గా ప్రపంచకప్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పరిస్థితి దారు ణంగా మారింది! క్రికెట్‌కు పుట్టి నిల్లయిన ఈ జట్టు ఇప్పటివరకు ప్రపంచకప్‌ను గెలవలేదు! ఈసారి సొంత దేశంలో జరిగే మెగా టోర్నీని ముద్దాడాలని తహతహలాడింది. అయతే ఒక్కసారిగా ఇంగ్లీష్ ఆట గాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి! కనీసం సెమీస్ వరకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది! దీంతో నేడు భారత్ తో జరిగే మ్యాచ్ ఆతిథ్య జట్టుకు కీలకంగా మారింది.
అనుకున్నట్లుగానే మొదటి మ్యాచ్‌లోనే బలమైన దక్షిణాఫ్రికా జట్టును 104 పరుగుల తేడాతో ఓడించి ఘనమైన ఆరంభాన్నిచ్చింది. గత రెండేళ్లుగా చక్కని ఫాంతో ఆగ్రస్థానంలోనూ కొనసాగింది. మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టు అదే జట్టుపై ప్రపంచకప్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే 14 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ లతో జరిగి న మ్యాచుల్లో విజయం సాధించింది.
శ్రీలంకతో తడ‘బ్యాటు’..
మూడు వరుస విజయాలతో తిరిగి పుంజుకుంద నుకున్న ఇంగ్లీష్ జట్టు తమ కంటే బలహీనమైన జట్టు శ్రీలంక చేతిలో దారుణ పరా జయం ముటగట్టుకుంది. శ్రీలంక నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఈ మ్యాచ్‌లో జో రూట్, బెన్ స్టోక్స్ మినహా మరెవ్వరూ రాణించక పోవడంతో ఓటమి నుంచి తప్పిం చుకోలేక పోయింది. మ్యాచ్‌కి ముందు శ్రీలంకపై గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుందా మనుకున్నా మోర్గాన్ సేన ఆశలు ఆవిరయ్యాయ.
చిరకాల ప్రత్యర్థితోనూ..
టోర్నీకి ముందే నువ్వా..నేనా అన్నట్లు సాగిన ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు ఈ నెల 25న తలపడ్డాయ. అయతే టాస్ గెలిచి కూడా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించి తప్పు చేశాడు. సొంత మైదానాలపై పూర్తి అవగాహన ఉన్నా అతడి నిర్లక్ష్యం మ్యాచ్‌ను చేజా ర్చుకునేలా చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యా టింగ్‌కు దిగిన కంగారూలు 7 వికెట్లు కోల్పోయ 285 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు మొదటి నుంచే తడబడింది. కేవలం బెన్ స్టోక్స్ మినహా మరెవ్వరూ 30 పరుగులు కూడా చే యకపోవడంతో 221 పరుగులకే ఆలౌటై 64 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్ జట్టు నాలుగింట్లో గెలిచి, మరో మూడింట్లో ఓడిపోయి, 8 పాయంట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోతే సెమీస్ అవకాశాల్ని మరింత సంక్లిష్టం చేసుకున్నట్లే అవుతోం ది. తన తర్వాతి మ్యాచ్ న్యూజిలాండ్‌తోనూ ఇదే పరిస్థితి.
జోరు కొనసాగేనా..
మరోవైపు మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అదే జోరు కొనసా గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో న్యూజిలాండ్ జట్టుతో మాత్రమే ఫలితం తేలలేదు. మిగిలిన అన్నింట్లోనూ భారత్ విజయం సాధించి, 11 పాయంట్లతో రెండో స్థానంలో నిలిచింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో కొంత తడబాటుకు గురైన టీమిండియా, ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ముందు గా బ్యాటింగ్‌కు భారత్ దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాణించడంతో 268 పరుగులు చేసింది. వెస్టిండీస్ వంటి జట్టుపై అది తక్కువ స్కోరే అయనా భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం ఇంగ్లాండ్ జరిగే మ్యాచ్‌కు కోహ్లీసేన ఎలాంటి మార్పుల్లేకుండానే దిగనుంది.
మెన్ ఇన్ ఆరెంజ్..
నేటి మ్యాచ్‌లో కోహ్లీసేన ఆరెంజ్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ది, భారత్ ది బ్లూ కలర్ జెర్సీలే కావడంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన జెర్సీ మార్చనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు రెండు జెర్సీలను కలిగి ఉండాలి. ఇంగ్లాండ్ ఆతిథ్య జట్టు కాబట్టి దానికి జెర్సీ విషయంలో మినహా యంపు ఉంటుంది.
ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లాండ్-్భరత్ మొత్తం 7సార్లు తలపడ్డాయ. ఇందులో ఇరు జట్లు చెరో మూడు మ్యాచుల్లో విజయం సాధించగా, చివరిసారి గా 2011లో జరిగిన ప్రపంచకప్‌లో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

చిత్రం... నెట్ ప్రాక్టీస్‌లో మహేంద్రసింగ్ ధోనీ