క్రీడాభూమి

హాకీ గోల్‌కీపర్లకు ప్రత్యేక శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 30: శ్రీజేష్, క్రిషన్ బహదూర్ పాఠక్‌సహా మొత్తం తొమిమది మంది భారత గోల్‌కీపర్లకు ఏడు రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ ప్రఖ్యాత గోల్‌కీంగ్ ట్రైనర్ డెన్నిస్ వాన్ డె పొల్ భారత ఈ శిబిరంలో పాల్గొనే భారత గోల్‌కీపర్లకు శిక్షణనిస్తారు. ఇక్కడి భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రంలో జరిగే ఈ శిబిరానికి చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ కూడా హాజరవుతాడు. కాగా, శ్రీజేష్, క్రిషన్ బహదూర్‌తోపాటు సూరజ్ కర్కేరా, జుగ్రాజ్ సింగ్, పరాస్ మల్హోత్రా, జగ్దీప్ దయాల్, పవన్, ప్రశాంత్ కుమార్ చౌహాన్, షాహిల్ కుమార్ నాయక్ కూడా ఈ శిబిరానికి ఎంపికయ్యారు. కోల్‌కీపర్లకు ప్రత్యేకంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారని చీఫ్ కోచ్ రీడ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. రాబోయే టోర్నీలు, సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని, భారత్ అన్ని విధాలా రాణించాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్టు చెప్పాడు.
జూనియర్స్ విభాగంలో 33 మంది ప్రాబబుల్స్
న్యూఢిల్లీ: జూనియర్స్ విభాగంలో 33 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గోల్‌కీపర్లకు ప్రత్యేక శిక్షణా శిబిరం జరిగే బెంగళూరులోని సాయ్ కేంద్రంలోనే, ఈ ప్రాబబుల్స్‌కు కూడా ట్రైనింగ్ ఉంటుందని వివరించింది. రాబోయే టోర్నమెంట్స్‌లో కాంబినేషన్స్‌ను ఎంపిక చేసుకోవడానికి వీ లుగా నిర్వహించే ఈ శిబిరం నాలుగు వారాలు ఉంటుందని పేర్కొంది. జూనియర్స్ జట్టు తన తర్వాతి టోర్నమెంట్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో ఆడుతుం దని వివరించింది. కాగా, ఎంపికైన ప్రాబబుల్స్ అంతా సమర్థులేనని, వారి నుంచి జా తీయ జట్టుకు సభ్యులను ఎంపిక చేయడం అనుకున్నంత సులభం కాదని హెచ్‌ఐ హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ తెలిపాడు. ప్రాబబుల్స్ తమతమ నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవడానికి ఈ శిబి రం ఉపయోగపడుతుందన్నాడు.