క్రీడాభూమి

ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్జిబాస్టర్: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా అనూహ్యంగా సెమీస్ నుంచే నిష్క్రమించింది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ను ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన ఇంగ్లాండ్ ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొంటుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించిన రెండు జట్లు టైటిల్ పోరులో నిలవడం విశేషం. ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్‌కాగా, ఇంగ్లాండ్ 32.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు జానీ బెయర్‌స్టో, జాసన్ రాయ్ చక్కటి ఆరంభాన్నిస్తే, ఇయాన్ మోర్గాన్, జో రూట్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఆరంభంలోనే వికెట్ల పతనం..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించడం కంటే, నిర్దేశించడమే మేలన్న ఉద్దేశంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కేవలం నాలుగు పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కెప్టెన్ ఆరోన్ ఫించ్ (0) రూపంలో కోల్పోయింది. జొఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మొదటి బంతికే అతను ఎల్‌బీగా వెనుదిరిగాడు. స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతను రెండు ఫోర్ల సాయంతో 9 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో, జానీ బెయిర్‌స్టో క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. హార్డ్ హిట్టర్ పీటర్ హ్యాండ్స్‌కోమ్ 12 బంతుల్లో నాలుగు పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ కావడంతో 14 పరుగులకే ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ అలెక్స్ కారీ జట్టును ఆదుకోవడానికి విశేషంగా శ్రమించారు. నాలుగో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 70 బంతుల్లో, నాలుగు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసిన కారీని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జేమ్స్ విన్స్ క్యాచ్ పట్టగా, అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔట్‌కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మార్కస్ స్టొయినిస్ (0), గ్లేన్ మాక్స్‌వెల్ (22), పాట్ కమిన్స్ (6) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, సెంచరీ దిశగా వెళుతున్న స్టీవ్ స్మిత్ 85 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. చివరిలో మిచెల్ స్టార్క్ 29 పరుగులు చేయగా, జేమ్స్ బెహ్రెన్‌డార్ఫ్ కేవలం ఒక పరుగుకే వెనుదిరిగాడు. ఆసీస్ 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అప్పటికి నాథన్ లియాన్ 5 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 20 పరుగులకు మూడు, అదిల్ రషీద్ 54 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. జొఫ్రా ఆర్చర్‌కు రెండు, మార్క్ ఉడ్‌కు ఒకటి చొప్పున వికెట్లు లభించాయి.
తొలి వికెట్‌కు 124 పరుగులు
ఆసీస్‌ను ఓడించి, ఫైనల్‌కు దూసుకెళ్లడానికి 224 పరుగులు చేయాల్సిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. 43 బంతుల్లో 34 పరుగులు చేసిన బెయిర్‌స్టోను మిచెల్ స్టార్క్ ఎల్‌బీగా పెవిలియన్‌కు పంపడంతో, ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో 23 పరుగుల తర్వాత రాయ్ వికెట్ కూడా కూలింది. 65 బంతుల్లోనే, తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 85 పరుగులు చేసిన రాయ్‌ని అలెక్స్ కారీ క్యాచ్ పట్టగా పాట్ కమిన్స్ ఔట్ చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ ఔటైన తర్వాత ఇయాన్ మోర్గాన్ (39 బంతుల్లో 45 నాటౌట్), జో రూట్ (46 బంతుల్లో 49 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, ఇంకా 107 బంతులు మిగిలి ఉండ గానే ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించారు. ఫైనల్లో కివీస్‌తో పోరును ఖాయం చేశారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 49 ఓవర్లలో ఆలౌట్ 223 (స్టీవెన్ స్మిత్ రనౌట్ 85, అలెక్స్ కారీ 46, గ్లేన్ మాక్స్‌వెల్ 22, మిచెల్ స్టార్క్ 29, క్రిస్ వోక్స్ 3/20, జొఫ్రా ఆర్చర్ 12/32, మార్క్ ఉడ్ 1/45, అదిల్ రషీద్ 3/54.
ఇంగ్లాండ్: 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 226 (జాసన్ 85, జానీ బెయిర్‌స్టో 34, జో రూట్ 49 నాటౌట్, ఇయాన్ మోర్గాన్ 45 నాటౌట్, మిచెల్ స్టార్క్ 1/70, పాట్ కమిన్స్ 1/34.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు చక్కటి ఆరంభాన్నిచ్చిన జానీ బెయిర్‌స్టో (ఎడమ), జాసన్ రాయ్ (కుడి). వీరిద్దరూ తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ వేసవిలో వీరు ఆడిన ఏడు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో వరుసగా 115, 159, 1, 12, 128, 160, 123 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు.