క్రీడాభూమి

వచ్చేవారం బెంగళూరులో సైనా ప్రాక్టీస్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 18: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బెంగళూరులో వచ్చే వారం ప్రాక్టీస్ మొదలు పెడుతుందని ఆమె తండ్రి హర్వీర్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో గాయానికి చికిత్స పొందుతున్నదని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. వేగంగా కోలుకుంటున్నదని, వచ్చే వారం బెంగళూరు వెళ్లి, ప్రాక్టీస్‌ను ఆరంభిస్తుందని చెప్పాడు. ఈఏడాది సైనా అద్భుత ప్రతిభ కనబరచిందని, వచ్చే సీజన్ కూడా అదే రీతిలో కొనసాగుతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పాడు. ఆల్ ఇంగ్లాండ్, ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో ఫైనల్ చేరిన విషయాన్ని అతను గుర్తుచేస్తూ, వచ్చే సీజన్‌లో టైటిళ్లను దక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడుతుందని అన్నాడు. గాయాల కారణంగా కొన్ని టోర్నీల్లో ఆమె అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిందని తెలిపాడు. ప్రపంచ నంబర్ వన్ కరోలిన్ మారిన్‌ను కూడా ఓడించడం సైనా సామర్థ్యానికి గీటురాయని వ్యాఖ్యానించాడు. వచ్చేనెల ప్రారంభం కానున్న ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (బిపిఎల్)లో సైనా పాల్గొంటుందా అన్న ప్రశ్నకు హర్వీర్ నేరుగా సమాధానం చెప్పలేదు. ఆ విషయం సైనా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నాడు.