క్రీడాభూమి

ఐపీఎల్ విస్తరణకు సన్నాహాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 14: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విస్తరణపై ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఇక్కడ జరగనున్న సమావేశంలో చర్చించనున్నాయి. ఎనిమిది జట్లతో ఐపీఎల్ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. 2011లో కొచ్చి, పుణే ఫ్రాంచైజీలు చేరడంతో వీటి సంఖ్య పదికి పెరిగింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)తో ఫీజు చెల్లింపు తదితర అంశాలపై తలెత్తిన వివాదాల కారణంగా కొచ్చి ఫ్రాంచైజ్ ఒక సీజన్‌కే పరిమితమైంది. 2012, 2013 సీజన్లు తొమ్మిది జట్లతో జరిగాయి. కాగా, సహారా సంస్థ కొనుగోలు చేసిన పుణే వారియర్స్ జట్టు 2013లో ఐపీఎల్ నుంచి వైదొలగింది. ఫలితంగా 2014 నుంచి ఐపీఎల్ మళ్లీ ఎనిమిది జట్లకు తగ్గింది. అయితే, ఈ టోర్నీకి విశేష ఆదరణ ఉండడంతో, దీనిని మరింతగా విస్తరించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే, మరో రెండు ఫ్రాంచైజీలను తీసుకొని, మళ్లీ పది జట్లతో నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు సంవత్సరాల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నప్పుడు, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, గుజరాత్ లయన్స్ జట్లు ఆ లోటును భర్తీ చేశాయి. 2017లో, తమ రెండో ఐపీఎల్ ఆడుతున్నప్పుడు రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఏకంగా ఫైనల్ చేరింది. 2018లో చెన్నై, రాజస్థాన్ జట్లు మళ్లీ రంగ ప్రవేశం చేయడంతో, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఫ్రాంచైజీలు తప్పుకోవాల్సి వచ్చింది. విస్తరణపై ఫ్రాంచైజీలు ఒక నిర్ణయానికి వస్తే, ఈ రెండు జట్లు మళ్లీ ఐపీఎల్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటినే తీసుకుంటారా లేక మళ్లీ బిడ్స్‌ను ఆహ్వానించి, ఫ్రాంజైల ఎంపికను తాజాగా మొద లు పెడతారా అన్నది చూడాలి.