క్రీడాభూమి

అత్యధిక పరుగుల రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 14: ఒక ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డును కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 575 పరుగులు) సొంతం చేసుకున్నాడు. 2007లో జయవర్ధనే 548 పరుగులతో నెలకొల్పిన రికార్డును అతను అధిగమించాడు. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 2007లో 538 పరుగులు, ఈసారి వరల్డ్ కప్‌లో ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) 507 పరుగులు చొప్పున సాధించారు.
ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ను బెన్ స్టోక్స్ మూడు పర్యాయాలు, మార్క్ ఉడ్ రెండుసార్లు ఔట్ చేశారు. క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, జో రూట్ ఒక్కోసారి అతనిని పెవిలియన్‌కు పంపారు. ఈ మ్యాచ్‌లో లియామ్ ప్లంకెట్ అతనిని ఔట్ చేశాడు. దీనితో జొఫ్రా ఆర్చర్ మాత్రమే ఇంగ్లాండ్ బౌలర్లలో ఒక్కసారి కూడా విలియమ్‌సన్‌ను ఔట్ చేయలేకపోయాడు.
ఈ వరల్డ్ కప్‌లో భాగంగా ఫైనల్‌కు ముందు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు లార్డ్స్ మైదానంలో జరిగాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 49 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో గెలిచింది. నాలుగో మ్యాచ్‌లో పాకిస్తాన్ 94 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్‌పై గెలుపొందింది.
2015 వరల్డ్ కప్ తర్వాత ఆదివారం నాటి తాజా ఫైనల్ మధ్యకాలంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు మూడు ఐసీసీ ఈవెంట్స్‌లో ఢీకొన్నాయి. 2016లో జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌లో ఇంగ్లాండ్ 87 పరుగులతో విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 119 పరుగుల ఆధిక్యంతో ఓడించి, ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
గత నాలుగు మ్యాచ్‌ల్లో, మొదటి పవర్‌ప్లేలో న్యూజిలాండ్ సాధించిన పరుగులు.. ఆస్ట్రేలియాపై 31 (ఒక వికెట్), ఇంగ్లాండ్‌పై 37 (రెండు వికెట్లు), భారత్‌పై 27 (ఒక వికెట్), తాజా మ్యాచ్‌లో 33/1.
న్యూజిలాండ్ ఓపెనర్లు ఈ వరల్డ్ కప్‌లో అందించిన భాగస్వామ్యాలు వరుసగా 137, 35, 0, 12, 0, 5, 29, 2, 1, 29 పరుగులు. పది ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రెండు పర్యాయాలు పార్ట్‌నర్‌షిప్ ఖాతానే తెరవలేదు. మరో మూడుసార్లు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. ఒకసారి మాత్రమే వందకుపైగా భాగస్వామ్యాన్ని అందించగలిగారు.
న్యూజిలాండ్ స్కోరు రెండు వందల మైలురాయిని దాటడం కూడా కష్టంగా కనిపించింది. అయితే, మార్క్ ఉడ్, లియాం ప్లంకెట్, జొఫ్రా ఆర్చర్ ఫార్టీ ప్లస్ పరుగులు సమర్పించుకొని, పరోక్షంగా కివీస్‌ను ఆదుకున్నాడు. ఇక ఆ జట్టులో ఏడుగురి స్కోరు కంటే ఎక్‌స్ట్రాల రూపంలో న్యూజిలాండ్‌కు లభించిన పరుగులే ఎక్కువ. లెగ్‌బైస్ 12, వైడ్స్ 17, నోబాల్ ఒకటి కలిపి మొత్తం 30 పరుగులు ఎక్‌స్ట్రాల రూపంలో న్యూజిలాండ్‌కు లభించాయి.
*వనే్డల్లో ఇంగ్లాండ్‌ను ఢీకొన్నప్పుడు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్ నాలుగు పర్యాయాలు
క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొత్తం 115 బంతులు ఎదుర్కొన్నాడు. 97 పరుగులు చేశాడు.
ఆదివారం నాటి వరల్డ్ కప్ ఫైనల్లో వోక్స్ బంతిని
అర్థం చేసుకోలేక, వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు.
*గుప్టిల్ 2015 వరల్డ్ కప్‌లో 547 పరుగులు
(సగటు 68.37) సాధించాడు. అత్యధిక స్కోరు 237 (నాటౌట్) పరుగులు. నాలుగేళ్ల తర్వాత, ఈసారి
వరల్డ్ కప్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 186 పరుగులు (సగటు 20.66)

చిత్రాలు.. కేన్ విలియమ్‌సన్* మార్టిన్ గుప్టిల్