క్రీడాభూమి

క్రికెట్‌కు దూరంగా ఉండండి : నీషమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 15: పిల్లలకు క్రికెట్‌కు దూరంగా ఉండి, ఇతర విషయాలను నేర్చుకోవాలని న్యూజి లాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ట్విటర్ ద్వారా సూచించాడు. అంతకు ముందు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు శుభాకాంక్ష లు చెప్పాడు. అనంతరం చేసిన ట్వీట్‌లో తాము అభిమానుల అంచ నాలను అందుకోలేక పోయామని, అందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. మెగా టోర్నీలో జరిగిన చివరి ఓవర్‌ను గుర్తుచేసుకుంటూ ‘ఆ అరగంట మ్యాచ్‌ను తను ఇక గుర్తు చేసుకోను’ అని చెప్పాడు. ఇక పిల్లలు క్రికెట్‌కు దూరంగా ఉంటే, 60 ఏళ్ల పాటు ఆనందంగా గడిపి చనిపోవచ్చని సూచించాడు. అలాగే జట్టుకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. నీషమ్ వరుస ట్వీట్లకు క్రికెట్ అభి మానులు, దేశ ప్రజల నుంచి అనూహ్యా స్పందన వస్తోంది. తనకు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయ 242 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ సైతం 242 పరు గులే చేసి ఆలౌటైంది. దీంతో సూపర్ ఓవర్ ఆడిన ఇరు జట్లు 16 పరుగులు చేయడంతో బౌండరీల ఆధారంగా నిర్వాహకులు ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.