క్రీడాభూమి

ఐసీసీ అత్యుత్తమ జట్టులో బూమ్రా, రోహిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 15: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బూమ్రా చోటు దక్కించుకున్నారు. ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఐసీసీ ఈ జట్టును ప్రకటించింది. మె గా టోర్నీ మొత్తంగా రోహిత్ శర్మ 9 మ్యాచుల్లో 648 పరుగులు చేయగా, బుమ్రా 18 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ జట్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌కు చెందిన నలుగురు ఆట గాళ్లను తీసుకోగా, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా, భారత్ నుంచి ఇద్దరు, బంగ్లాదేశ్ నుంచి ఒక ఆటగాడికి చోటు కల్పించగా, న్యూజి లాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ని కెప్టెన్‌గా పేర్కొంది.
ఐసీసీ ప్రకటించిన జట్టులో రోహి త్ శర్మ 6484పరుగులతో టోర్న మెంట్‌లో ముందు వరుసలో నిలవ గా, జాసన్ రాయ్ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమైనా ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో బంగ్లాదేశ్‌పై ఒక సెంచరీతో పాటు 5 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక మూడో స్థానానికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ ను ఎంపిక చేయగా, ఇంగ్లాండ్ జట్టు నుంచి టాప్, ఓవరాల్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్ మన్ జో రూట్‌ని నాలుగో స్థానంలో తీసుకుంది. అయతే ఐసీసీ ప్రకటించి న జట్టులో టీమిండియా నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం పై భారత అభిమానుల్లో అసహనం వ్యక్తమ వుతోంది. మెగా టోర్నీలో కోహ్లీ 55.38 సగటుతో 443 పరుగులు చేశాడు.
ఐసీసీ అత్యుత్తమ జట్టు: రోహిత్ శర్మ (భారత్), జాసన్ రాయ్ (ఇంగ్లాం డ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాం డ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), జో రూట్ (ఇంగ్లాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలి యా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్), లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్), జస్ప్రీత్ బూమ్రా (భారత్), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్).