క్రీడాభూమి

నిబంధనలపై విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ ఓవర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించడాన్ని తప్పుపడుతూ మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రెంట్ బౌల్ట్ వేసిన చివరి ఓవర్ మూడో బంతికి వచ్చిన అదనపు పరుగులపై కూడా క్రికెట్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. దీనిపై ఐసీసీ నిబంధనలు మార్చుకోవాలంటూ సూచిస్తు న్నారు. కేవలం బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం సరికాదంటూ తేల్చి చెబుతున్నారు. ఇదిలాఉంటే ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్ ద్వారా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఈసారీ అదే రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. టోర్నీకి ముందు హాట్ ఫెవరిట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ నుంచే నిష్క్రమించగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు గ్రూపు దశలోనే ఇంటిబాట పట్టాయ. అయితే ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మెగా టోర్నీ కలిసిరాకపోగా, సంచలనాల జట్టుగా పేరొందిన అఫ్గానిస్తాన్ ఆడిన 9 మ్యాచుల్లో అన్నింటా ఓటమి చవిచూసింది. ఇక ఎప్పటిలాగే పాకిస్తాన్ జట్టు మొదట్లో వరుస పరాజయాలు చవిచూడగా, చివర్లో సంచలన విజయాలు నమోదు చేసినా రన్‌రేట్ కారణంగా 5వ స్థానంతోనే సరిపెట్టుకుంది. కొత్త కుర్రాళ్లు, కెప్టెన్‌తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేక పోయింది. అయితే అప్పటివరకు వరుస విజయాల ను సాధించిన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. గత ప్రపంచ కప్‌లానే బంగ్లాదేశ్ సంచలనాలను సృష్టించింది. అంచనాలకు తగ్గట్లుగానే ఆడినా దురదృష్టవత్తూ గ్రూపు దశలోనే నిష్క్రమించింది.
అంతా తారుమారు..
మెగా టోర్నీలో పాల్గొన్న 10 జట్ల నుంచి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు పాయింట్ల పట్టికల్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు చేరాయి. గ్రూపు దశలో అద్భుత ప్రతిభ కనబర్చిన టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కి వెళ్తాయని క్రికెట్ అభిమానులంతా ఊహించినా వారు అంచనాలు తారుమారయ్యాయి. మొదటి సెమీస్‌లో భారత్‌పై న్యూజిలాండ్ అనూహ్యా విజయం సాధించగా, చిరకాల ప్రత్యర్థి ఆసిస్‌పై ఇంగ్లాండ్ అద్భుత పోరాట పటిమతో గెలుపొంది ఫైనల్‌కు చేరాయి.
కివీస్‌కు అందని ద్రాక్షే..
గత ప్రపంచకప్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాం డ్ జట్టుకు మరోసారి మెగా ట్రోఫీని ముద్దాడే అవకాశం లభించింది. అయితే తనకంటే బలమైన ఇంగ్లాండ్ జట్టును సొంత గడ్డపై ఓడించడం కివీస్‌కు కత్తిమీద సాము వంటిందే. అప్పటికే భారత్‌పై గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించి ట్రోఫీని ఎగరేసుకెళ్లే విధంగా విలియమ్సన్ సేన బరిలోకి దిగింది. టాస్ గెలవడంతోనే సగం మ్యాచ్ గెలిచామన్న ఆనందంతో బ్యాటింగ్ దిగిన కివీస్‌కు ఇంగ్లీష్ బౌలర్లు చుక్కలు చూపించి, 242 పరుగులకే కట్టడి చేశారు.
చెమటోడ్చిన మోర్గాన్ సేన..
ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన మోర్గాన్ సేన సొంత మైదానంలో చెలరేగుతుందనుకున్న అభిమా నులకు ఇంగ్లాండ్ జట్టు షాకిచ్చింది. అతి కష్టమీద చివరి బంతి కి స్కోరును సమం చేయడంతో మ్యాచ్ టై అయింది.
విజేతను తేల్చిన సూపర్ ఓవర్..
ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో అంపైర్లు సూపర్ ఓవ ర్ ఆడించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. లక్ష్యానికి దిగిన న్యూజిలాం డ్ కూడా వికెట్ నష్టపోయి అంతే పరుగులు చేయడంతో అభి మానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే నిబంధనల ప్రకారం అధిక బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ జట్టును అంపైర్లు విజేతగా ప్రకటించారు. దీంతో మొదటిసారి ఇంగ్లాండ్ సొంత గడ్డపై ప్రపంచకప్ సాధించగా, వరుసగా రెండోసారి న్యూజిలాండ్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.