క్రీడాభూమి

ఎవరూ ఓడిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జూలై 16: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నారు. మంగళవారం విలియమ్సన్ మీడియాతో మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ రెండుసార్లు టై కావడంతో బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం పై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఇలాంటి ప్రశ్న అడగాల్సి వస్తుందని మీరు ఊహించి ఉండరని, దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని తనెప్పుడూ అనుకోలేదని పేర్కొన్నాడు. అయితే బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడం సిగ్గు చేటని తొలిసారి విలియమ్సన్ వ్యాఖ్యానించడం విశేషం. రెండు జట్లు సమాన ఆట తీరును ప్రదర్శించినప్పుడు ఇలాంటి ఫలితాలు బాధాకరమని పేర్కొన్నాడు.