క్రీడాభూమి

మహేంద్రుడికి దక్కని చోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ తన వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్ ప్రకటించిన జట్టు లో ఐదురుగురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించినా, అందులో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి మాత్రం స్థానం దక్కలేదు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరు గులు సాధించిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో పాటు మీడియం పేసర్ జస్ప్రీత్ బూమ్రాకు మాత్రమే చోటు క ల్పించడం విశేషం. అయితే కొద్ది రోజుల ముందు కూడా ధోనీ స్పిన్ ఆడడంలో విఫలమవుతున్నాడంటూ విమర్శించిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్‌గా ధోనీకి బదులు ఇం గ్లాండ్ ఆటగాడు జానీ బెయర్ స్టోకు అవకాశం కల్పించాడు. సచిన్ ప్రకటిం చిన జట్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా పేర్కొన్నా డు. అయతే ఐసీసీ ప్రకటించిన జట్టులో భారత్ నుంచి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లు మాత్రమే ఉండగా, సచిన్ జట్టులో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లున్నారు.
తెండూల్కర్ వరల్డ్ కప్ ఎలెవన్ జట్టు: రోహిత్ శర్మ, జానీ బెయర్ స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్.