క్రీడాభూమి

బీసీసీఐ కార్యదర్శి అధికారాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి అధికారాలకు కత్తెరపడింది. బోర్డు పాలనాధికారుల బృందం (సీఓఏ) కొత్త నిబంధనావళిని అనుసరించి కార్యకలాపాలు జరగాలని ప్రకటించింది. సెలక్షన్ కమిటీ సమావేశాలను పిలవడంగానీ, వాటికి హాజరుకావడంగానీ చేయకూడదని బీసీసీఐ కార్యదర్శికి స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిబంధనలను అనుసరించి, దేశంలో జరిగే సెలక్షన్ కమిటీ లేదా బోర్డుకు సంబంధించిన వివిధ అనుబంధ కమిటీల సమావేశాలను నిర్వహిస్తున్నట్టు కార్యదర్శి నోటీసు జారీ చేస్తాడు. అంతేగాక, ఆయా సమావేశాలకు హాజరవుతాడు. వివిధ స్థాయిలో జట్లను ఎంపిక చేసే కమిటీల సమావేశాలకు హాజరై, జట్ల కూర్పుపై తన అభిప్రాయాలను వెల్లడిస్తాడు. ఒకవేళ విదేశాల్లో సమావేశాలు అవసరమైతే, జట్టు మేనేజర్ వాటిని నిర్వహిస్తాడు. అయితే, కార్యదర్శికి ఎప్పటికప్పుడు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. చివరికి గాయపడిన ఆటగాళ్ల స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయడం కూడా కార్యదర్శి కనుసన్నల్లోనే జరుగుతుంది. జట్టులో మార్పులుచేర్పులు చేయాలన్నా, రీప్లేస్‌మెంట్ అవసరమైనా, ముందుగా కార్యదర్శి అనుమతి తీసుకున్న తర్వాతే ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, జూనియర్స్, పురుషులు, మహిళల క్రికెట్ జట్ల ఎంపిక నుంచి రీప్లేస్‌మెంట్స్ వరకూ ప్రతి అడుగులోనూ కార్యదర్శి కీలక పాత్ర పోషిస్తాడు. అతని అనుమతి పొందిన తర్వాతే నిర్ణయాలు అమల్లోకి వస్తాయి.
ఇలావుంటే, లోధా కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను తు.చ తప్పకుండా పాటించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సీఓఏ చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే, బీసీసీఐ కార్యదర్శి అధికారాలకు బ్రేక్ వేసింది. ఇక ముందు సెలక్షన్ కమిటీల సమావేశాలను కార్యదర్శి నిర్వహించకూడదని, హాజరు కాకూడదని సీఓఏ తేల్చిచెప్పింది. అంతేగాక, ఆటగాళ్ల మార్పులుచేర్పుల విషయంలో కార్యదర్శి అనుమతి పొందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జట్ల ఎంపిక లేదా ఇతరత్రా అంశాలు మాజీ క్రికెటర్ల పర్యవేక్షణలోనే జరగాలని లోధా కమిటీ చేసిన ప్రతిపాదనను సీఓఏ ఈ సందర్భంగా గుర్తు చేసింది.