క్రీడాభూమి

ఉషకు సరైన గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ లెజెండ్ పీటీ ఉషకు సరైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ‘వెటరన్ పిన్’గా ఆమె పేరును పరిశీలనకు తీసుకున్నారు. ‘క్వీన్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్’, ‘పయోలీ ఎక్స్‌ప్రెస్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఉష జాతీయ పోటీల్లో ఐదు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. 100 మీటర్లు, 200 మీటరర్లు, 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్, 4న400 మీటర్ల రిలే విభాగాల్లో స్వర్ణాలను దక్కించుకున్న ఆమె, 1985లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కెరీర్ ముగిసిన తర్వాత ఆమె కోచ్‌గా ఎంతో మంది యువ అథ్లెట్లను దేశానికి అందించింది. అథ్లెటిక్స్ రంగంలో ఉష చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెను ‘వెటరన్ పిన్’గా ఎంపిక చేసేందుకు ప్రతిపాదించినట్టు ఐఏఏఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జొన్ రిడ్గియాన్ ఒక ప్రకటనలో తెలిపాడు. సెప్టెంబర్ మాసంలో కతార్‌లో జరిగే సమాఖ్య సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, ఈ ప్రతిపాదనను సమావేశం తీర్మానించడం ఖాయంగా కనిపిస్తున్నది.