క్రీడాభూమి

కెరీర్ ముగిసినట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ కెరీర్ ముగిసినట్టేనని పరిశీలకుల అభిప్రాయం. వరల్డ్ కప్ క్రికెట్‌లో వీరిద్దరి ఆట అందరినీ నిరాశకు గురి చేసింది. ఆ మెగా టోర్నీలో ముగ్గురు కీపర్లు, ధోనీ, పంత్, దినేష్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించడంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. యువ ఆటగాడు పంత్ రేసులో ఉన్నందున దినేష్‌కు చోటు దక్కడం అసంభవంగానే చెప్పాలి. స్పెషలిస్టు స్పిన్నర్లు జట్టులో ఉంటే, జాదవ్ ఎంపిక అసాధ్యమవుతుంది. ఏ రకంగా చూసినా, జాదవ్, దినేష్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తున్నది. కెప్టెన్ కోహ్లీ లేదా అతని స్థానంలో నాయకత్వం వహించే రోహిత్ శర్మతోపాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌కు జట్టులో చోటు ఖాయమనే అనుకోవాలి. 19 ఏళ్ల దీపక్ చాహర్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. పేసర్లలో మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ చోటు పదిలంగానే ఉంటుందని అంటున్నారు. ఖలీల్ అహ్మద్, నవ్‌దీప్ సైనీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా, ధోనీకి చోటు, కోహ్లీ అందుబాటు అంశాలపైనే అంతా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

చిత్రాలు.. కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్