క్రీడాభూమి

ధోనీ ఎంపికపై చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జాతీయ జట్టులో చోటు ఉంటుందా? లేక అతని స్థానంలో యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను ఎంపిక చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చేనెల వెస్టిండీస్ టూర్‌కు టీమిండియాను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన సమావేశం కానున్న జాతీయ సెలక్షన్ కమిటీ ధోనీకి చోటు కల్పించే విషయంపై ప్రధానంగా చర్చిస్తుందని సమాచారం. అదే విధంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్ టూర్‌కు అందుబాటులో ఉండడేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 38 ఏళ్ల ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడన్న వార్త వినిపిస్తున్నప్పటికీ, అతను ఇంతవరకూ ఈ విషయంపై నోరు మెదపలేదు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టీ-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, యువ ఆటగాడు పంత్‌ను జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధికారులు ఇటీవల ఒక ప్రకటనలో ధోనీని ప్రశంసల్లో ముంచెత్తడం, మరికొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ అడే సత్తా అడనికి ఉందని వ్యాఖ్యానించడం అనుమానాలకు తావిస్తున్నది. విండీస్ టూర్‌కు అతనిని ఎంపిక చేస్తారని బీసీసీఐ పరోక్షంగా చెప్పిందని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. విండీస్ పర్యటనలో టీమిండియా మూడు టీ-20, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్, మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పూర్తిస్థాయి టూర్‌లో ధోనీ ఉంటాడా లేక పంత్‌కు అవకాశం ఇస్తారా లేదా ఇద్దరినీ ఎంపిక చేస్తారా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో శిఖర్ ధావన్ గాయమై టోర్నీకి దూరమైనప్పుడు, అతని స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాబట్టి విండీస్ టూర్‌లో ఒకవేళ ధోనీ ఉన్నప్పటికీ, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా పంత్‌కు జట్టులో చోటిచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలావుంటే, అవిశ్రాంతంగా వివిధ టోర్నీలు, సిరీస్‌లు ఆడుతున్నానని, తనను విండీస్ టూర్ నుంచి మినహాయించాలని సెలక్టర్లను కోహ్లీ కోరినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అతను పరిమిత ఓవర్ల సిరీస్‌లకు అందుబాటులో ఉండకపోతే, రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలను అప్పచెప్పడం ఖాయం. టీ-20, వనే్డ ఇంటర్నేషనల్స్ తర్వాత జరిగే టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే కోహ్లీ విండీస్ చేరుకుంటాడని అంటున్నారు. అతను వెళితే, టెస్టు సిరీస్‌కు అతనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, మిడిల్ ఆర్డర్ వైఫల్యాలు వరల్డ్ కప్‌లో టీమిండియాను తీవ్రంగా వేధించాయి. శుక్రవారం నాటి సమావేశంలో సెలక్టర్లు దీనిపై దృష్టి కేంద్రీకరించనున్నారు. మాయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, శ్రేయార్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో భారతగా పరుగులు సాధించి, మిడిల్ ఆర్డర్‌లో చోటు కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. వెస్టిండీస్ ‘ఏ’తో జరిగిన అనధికార వనే్డ సిరీస్ మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసి, భారత్ ‘ఏ’ను గెలిపించిన పాండే ఇప్పటికే సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకున్నాడని అంటున్నారు. విజయ్ శంకర్ దారుణంగా విఫలం కావడం, అంబటి రాయుడు కెరీర్‌కు హఠాత్తుగా గుడ్‌బై చెప్పడం మిడిల్ ఆర్డర్‌లో కొత్త వారికి అవకాశాలను మెరుగుపరిచాయి. యువ సంచలనాలు శుభమ్ గిల్, పృథ్వీ షా కూడా రేస్‌లో ఉన్నారు. అయితే, కండరాలు బెణికి బాధపడుతున్న పృథ్వీ షా పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఫిట్నెస్ సమస్య ఉంటే, అతనిని విండీస్ టూర్‌కు ఎంపిక చేసే అవకాశం ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో, మిడిల్ ఆర్డర్‌లో శ్రేయార్ అయ్యర్, శుభమ్ గిల్ పేర్లు టూర్‌కు ఎంపిక చేసే జాబితాలో ఉండవచ్చని పరిశీలకుల అభిప్రాయం.
చిత్రం...మహేంద్ర సింగ్ ధోనీ