క్రీడాభూమి

తెరమీదకు మళ్లీ ‘నాలుగు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ప్రపంచకప్ సెమీస్ నుంచే ఇంటిబాట పట్టిన టీమిండియా కరేబియాన్ టూర్‌కు సిద్ధమవుతోంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే పర్యటన సెప్టెంబర్ 3తో ముగుస్తుంది. నెల రోజుల పర్యటనలో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్టుతో మూడు వనే్డలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో మళ్లీ జట్టులో నాలుగో స్థానంపై చర్చ మొదలైంది. ప్రపంచకప్‌కు ముందే ఈ సమస్య పరిష్కారమవుతుందనుకున్న నేపథ్యంలో మరోసారి తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కుర్రాళ్లకు అవకాశం?
ప్రపంచకప్‌కు ముందు వరుసగా క్రికెట్ ఆడిన భారత జట్టు క్రికెటర్లకు సెలక్టర్లు విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ జరుగుతుండగానే కెప్టెన్ కోహ్లీతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వెస్టిండీస్ టూర్‌కు విశ్రాంతిని ఇస్తున్నట్లు అధికారి కంగా ప్రకటించింది. అయతే అనూహ్యంగా భారత్ ప్రపంచ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుపై పరాజయంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. విండీస్ టూర్‌కు ముందు సెలక్టర్లు సమా వేశం కానున్న తరుణంలో కెప్టెన్ కోహ్లీ తనకు విశ్రాంతి వద్దని తానూ కరేబియాన్ పర్యటనకు వస్తానని చెప్పడంతో సెలక్టర్లు ఆలోచనలో పడ్డారు. మరోవైపు మెగాటోర్నీలో పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డ మహేంద్రసింగ్ ధోనీని సైతం తప్పిస్తారనే ప్రచారం జరగడంతో రెండు సార్లు సెలక్షన్ కమిటీ సమావేశం వాయదా పడింది. ఈ క్రమంలో ధోనీయే తనకు రెండు నెలల విశ్రాంతి కావాలని కోరడంతో విండీస్ పర్యటనకు ఎవరెవరిని ఎంపిక చేయనున్నారనేది వెళ్తారనేది ప్రశ్నార్థ కంగా మారింది. అయితే మెగాటోర్నీలో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తిస్థాయ ఫిటెనెస్ సాధించాడా?లేదా? అనేది అనుమానంగానే ఉంది. ఇదే జరిగితే అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియన్, టెస్ట్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ స్థానంలో యువ క్రికెటర్ మయంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసే అవకాశముంది. వీరిద్దరితో పాటు మనీష్‌పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, రాహు ల్ చాహర్, కేఎస్ భరత్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ శంకర్‌కు డౌటే..
మెగా టోర్నీలో నాలుగో స్థానం కోసం జట్టులోకి తీసుకున్న తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ దారుణంగా విఫలమవడం, విజయ్ శంకర్ మధ్యలోనే గాయం కారణంగా తప్పించడంతో విండీస్ పర్యటనకు అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు యువ ఆటగాడు పృథ్వీ షా సైతం ఫిట్‌నెస్ నిరూపించుకోకుంటే జట్టుకు దూరమైనట్లే. వీరికి తోడు హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్డ్‌మెంట్ ప్రకటించడంతో నాలుగో స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సెలక్టర్లు సతమతమవుతున్నారనే ప్రచారం వినిపిస్తోంది. రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే ఆ తర్వాతి స్థానాల్లో జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వరుసగా క్రికెట్ ఆడుతున్న సీనియర్లకు మాత్రం విండీస్ టూర్‌కు విశ్రాంతిని ఇవ్వాలనే ఆలోచనలోనే సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్రం...టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ