క్రీడాభూమి

టెస్ట్ క్రికెట్‌లో కొత్త సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 23: టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త ఆవిష్కరణకు తెరలేవనుంది. వచ్చే నెల ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమయ్యే యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు పేర్లు, నెంబర్లు కలిగిన జెర్సీలను ధరించనున్నారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి. 1877 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క టెస్టులోనూ ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నెంబర్లు లేవు. తెల్లటి, గోధుమ రంగు జెర్సీలను మాత్రమే ధరించేవారు. అయితే వచ్చే నెల నుంచి జరగబోయే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల ఒప్పందంతో ఆటగాళ్లు తొలిసారి వైట్ జెర్సీలపై పేర్లు, నెంబర్లతో బరిలోకి దిగనున్నారు. దీనికి సంబంధించి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జో రూట్ ( నెంబర్, పేరు కలిగిన టెస్ట్ జెర్సీ) ఫొటోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది.