క్రీడాభూమి

విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్ కర్నాటక నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయ్ హజారే వ నే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ కర్నాటక ఇంటిదారిపట్టింది. జమ్మూ కశ్మీర్‌తో శుక్ర వారం జరిగిన మ్యాచ్‌ని 207 పరుగుల భారత తే డాతో కైవసం చేసుకున్నప్పటికీ, పాయంట్ల పట్టిక లో గ్రూప్-బి నుంచి మొత్తం 16 పాయంట్లతో మూడోస్థానంలో నిలిచిన కారణంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. తొలుత బ్యాటిం గ్‌కు దిగిన కర్నాటక 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టా నికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. చి దంబరం గౌతం 102 బంతుల్లో 109 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ జట్టు 27.3 ఓవర్ల లో 142 పరుగులకే ఆలౌటైంది. గ్రూప్-బిలో చెరి 20 పాయంట్లు సంపాదించిన జార్ఖండ్, గుజరాత్ జట్లు నాకౌట్‌కు చేరాయ. కేరళను గుజరాత్ 7 వికె ట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కేరళ 43.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్‌కాగా అనంతరం గుజరాత్ 32.5 ఓవర్లలో మూడు వికె ట్లు చేజార్చుకొని 103 పరుగులు చేసింది.
రాజస్థాన్‌ను 252 పరుగుల తేడాతో చిత్తు చేసిన తమిళనాడు గ్రూప్-ఎ నుంచి నాకౌట్ దశకు చేరిం ది. ఈ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 384 పరు గుల భారీ స్కోరును సాధించింది. దినేష్ కార్తీక్, బాబా అపరాజిత్ సెంచరీలతో కదంతొక్కారు. అ నంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 26.2 ఓవర్ల లో 132 పరుగులకే కుప్పకూలింది. రహీ షా ఆరు వికెట్లు పడగొట్టి, తమిళనాడు విజయాన్ని సులభ తరం చేశాడు. ఇదే గ్రూప్ నుంచి పంజాబ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఆ జట్టు సర్వీ సెస్‌తో చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలు త బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ 50 ఓవర్లలో 7 వికె ట్లకు 323 పరుగులు చేయగా, పంజాబ్ 49 ఓవర్ల లో 7 వికెట్లకు 325 పరుగులు చేసి గెలిచింది.
గ్రూప్-సి నుంచి విదర్భ, ఢిల్లీ జట్లు క్వార్టర్స్‌లో కి అడుగుపెట్టాయ. ఆంధ్రను ఢిల్లీ తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 49.2 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఢిల్లీ 34.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించింది. వాతావరణం కార ణంగా ఒక ఓవర్ కుదించిన మ్యాచ్‌లో మహారాష్ట్ర ను నాలుగు వికెట్ల తేడాతో విదర్భ ఓడించింది. మ హారాష్ట్ర 184 పరుగులకు ఆలౌట్‌కాగా, విదర్భ 6 వి కెట్లు కోల్పోయ లక్ష్యాన్ని చేరింది.
గ్రూప్-డి నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదే శ్ నాకౌట్ చేరాయ. ఉత్తర్ ప్రదేశ్ ఇదివరకే క్వాలిఫై కాగా, మధ్యప్రదేశ్‌ను హిమాచల్ ఓడించింది.