క్రీడాభూమి

నిలవాలంటే గెలవాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరుగనున్న ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇంతకుముందు ఈ టోర్నీలో రెండుసార్లు టైటిల్ సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకోవడంతో పాటు ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా, నైట్ రైడర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సన్‌రైజర్స్ ఎదురుచూస్తోంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు సరిసమానంగా 16 పాయింట్లు చొప్పున సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగివున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నైట్ రైడర్స్ కంటే ఎగువన మూడో స్థానంలో నిలిచింది. అయితే లీగ్ దశలో ఇటీవల సన్‌రైజర్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించడం ఆ జట్టుకు మానసికంగా సానుకూల అంశం. ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదివారం మరోసారి 22 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించి ప్లే-ఆఫ్ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఐపిఎల్‌లో ఇంతకుముందు 2012, 2014లో టైటిళ్లు కైవసం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఇటు రికార్డుల పరంగా కూడా సన్‌రైజర్స్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. అయితే 2013లో ప్లే-ఆఫ్ దశకు చేరుకున్నప్పటికీ టైటిల్ వేటలో విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారైనా చాంపియన్‌గా ఎదగాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే ముందు బుధవారం ఎలిమినేటర్‌లో నైట్ రైడర్స్‌పై విజయం సాధించి ఇంతకుముందు ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని సన్‌రైజర్స్ జట్టు ఎదురుచూస్తోంది.