క్రీడాభూమి

‘నాడా’ పరిధిలోకి త్వరలో బీసీసీఐ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కూడా త్వరలో జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) పరిధిలో చేరనుండడం శుభపరిణామమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ దిశగా బీసీసీఐ అడుగులు వేయడం హర్షణీయమని అన్నారు. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా)కు అనుబంధ సంస్థగా నాడా పని చేస్తుంది. ఈ పరిధిలోకి వచ్చేది లేదని సుమారు దశాబ్దకాలంగా భీష్మించుకొని కూర్చున్న బీసీసీఐ ఎట్టకేలకు రాజీకొచ్చింది. నాడా పరిధిలోకి వచ్చేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించింది. తగిన చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. క్రీడాకారులు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడకుండా కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) కూడా బీసీసీఐ ముందు చేతులెత్తేసింది. ఒక మేజర్ టోర్నీకి ముందు ఆరు నెలలు, పోటీలు ముసిగిన తర్వాత ఆరు నెలల పాటు ఎప్పుడు, ఎక్కడ ఉంటారో స్పష్టమైన వివరాలను ఇవ్వాలని వాడా జారీ చేసిన ఆదేశాలను బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ విధంగా ఆరు నెలల ముందుగానే తాము ఎక్కడ ఉంటామో చెప్పాలనడం అన్యాయమని, దీని వల్ల తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని భారత క్రికెటర్లు నానా యాగీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వివరాలు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. బీసీసీఐ వారికి వంతపాడింది. వాడాకు నేరుగా బీసీసీఐపైగానీ, భారత క్రికెటర్లపైగానీ చర్యలు తీసుకునే అధికారం లేదు. దీనితో ఐసిసిని ఆశ్రయించింది. క్రికెటర్లంతా తాము ఎక్కడ ఉండేదీ చెప్పించాలని ఐసిసిని కోరింది. కానీ, బీసీసీఐ కాదన్న తర్వత అవుననే ధైర్యం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి లేకపోయింది. వాడా నిబంధనలను అమలు చేయడానికి ససేమిరా అంది. సాకర్ నుంచి టెన్నిస్ వరకూ అన్ని క్రీడలకు సంబంధించిన వివిధ జాతీయ, అంతర్జాతీయ సంఘాలు, సమాఖ్యలు వాడా ఆదేశాలను పాటిస్తుంటే, బీసీసీఐ మాత్రం ఇప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఐసిసి ఆ విషయాన్ని మరచిపోయినట్టే నటిస్తోంది. తిరుగులేని ధన బలంతో బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌నేగాక, యావత్ క్రీడారంగాన్ని శాసిస్తున్నదనడానికి ఇదో తార్కారణం. కాగా, పదేళ్లుగా ఎంత మంది చెప్పినా పెడచెవిన పెడుతూ వచ్చిన బీసీసీఐ ఇప్పుడు నాడా పరిధిలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర క్రీడల మంత్రి రిజిజు అన్నారు. దేశమంతటా క్రీడల్లో పాదర్శకత సాధ్యమవుతుందని చెప్పారు. ఇన్నాళ్లూ బీసీసీఐని సాకుగా చూపి, నాడా పరిధిలోకి వచ్చేందుకు వ్యతిరేకిస్తున్న క్రీడా సమాఖ్యలు కూడా ఇకపై ఇదే బాటను అనుసరిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.