క్రీడాభూమి

అండర్-19 ట్రై సిరీస్ ఫైనల్‌లో భారత్‌దే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోవ్, ఆగస్టు 11: ఇంగ్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన అండర్-19 ట్రై సిరీస్ ఫైనల్‌లో భారత జట్టు విజయం వికెట్ల తేడాతో సాధించింది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఇద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 58 పరుగులు చేశారు. ఈ క్రమంలో తంజీద్ హసన్ (26) స్టంపవుట్‌గా వెనుదిగాడు. ఆ తర్వాత వచ్చిన మహ్మదుల్ హసన్ జాయ్‌తో కలిసి మరో ఓపెనర్ పర్వేజ్ హసన్ ఎమాన్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. మంచి జోరుమీదున్న పర్జేజ్ (60) అర్ధ సెంచరీ సాధించి సుషాంత్ మిశ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తౌహీద్ హుస్సేన్ (0)ను అదే ఓవర్‌లో సుషాంత్ అవుట్ చేయడంతో బంగ్లా కష్టాల్లో పడింది. అప్పటికీ 23 ఓవర్లలో 3 మూడు వికెట్లు కోల్పోయ 123 పరుగులు చేసింది.
వెంటవెంటనే..
రన్‌రేట్ బాగానే ఉన్నా షహబాత్ హుస్సేన్ జాయ్ (6), కెప్టెన్ అక్బర్ అలీ (1) వికెట్లను బంగ్లా వెంటవెంటనే కోల్పోయంది.
మరోవైపు సెంచరీకి సమీపిస్తున్న హసన్ జాయ్ మాత్రం స్వేచ్ఛగా ఆడుతూనే ఉన్నాడు. అయతే షమీమ్ హుస్సేన్ (32) కొద్దిసేపు భారత బౌలర్లను అడ్డుకున్నా, పుమాంక్ త్యాగి అద్భుత రనౌట్‌తో నిష్క్రమించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మృత్యుంజయ్ చౌదరి (4)ను కార్తీక్ త్యాగి పెవిలియన్‌కు పంపగా, అప్పటికే సెంచరీ చేసిన హుస్సేన్ జాయ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మరోవైపు తంజీమ్ హసన్ షకీబ్ (2), షోరిఫుల్ ఇస్లాం (1) వెంటవెంటనే రనౌట్ అయ్యారు. ఇక ఇన్నింగ్స్ చివరి బంతికి హుస్సేన్ జాయ్ (109) రనౌట్ కావడంతో బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 261 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కార్తీక్ త్యాగి, సుషాంత్ మిశ్రాలు చెరో 2 వికెట్లు తీసుకోగా, రవి రిష్నోల్, శుభాంగ్ హెడ్జ్ తలో వికెట్ పడగొట్టారు.

అద్భుతమైన భాగస్వామ్యాలు..

ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా ఆది నుంచే బంగ్లా బౌలర్ల భరతం పట్టారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద సక్సేనా (55)ను రకీబుల్ హసన్ రిటర్న్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జైస్వాల్ (50) కూడా అవుటయ్యాడు. మరికొద్దిసేపటికే ప్రజ్ఞేష్ కాంపిల్లేవార్ (2) కూడా అవుటవ్వడంతో భారత్ 126 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయంది. ఈ దశలో క్రీజులో ఉన్న ప్రియమ్ గార్గ్ , వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీలు సాధించి జట్టును గెలుపు తీరాలకు దగ్గర చేశారు. అయతే గార్గ్ (73) అవుట్ కాగా మిగతా పరుగులను తిలక్ వర్మ (17, నాటౌట్) సాయంతో జురెల్ (59, నాటౌట్) మరో 8 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేయడంతో భారత్ విజయం సాధించడంతో పాటు ట్రై సిరీస్‌ను కైవసం చేసుకుంది.