క్రీడాభూమి

టీ20లో థాయ్‌లాండ్ మహిళల రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, ఆగస్టు 11: టీ20 క్రికెట్‌లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. నెదర్లాం డ్స్, థాయ్‌లాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ రికార్డుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టును 54 పరుగులకే కుప్పకూ ల్చిన థాయ్‌లాండ్ జట్టు, ఆ తర్వాత 8 ఓవర్ల లోనే 2 వికెట్లను నష్టపోయ విజయం సాధిం చింది. ఈ మ్యాచ్ విజయం థాయ్‌లాం డ్ జట్టుకు వరుసగా 17వది కావడం విశేషం. 2014 మార్చి నుంచి 2015 వరకు ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా 16 మ్యాచుల్లో గెలవగా, దీనిని థాయ్‌లాండ్ మహిళా జట్టు అధిగమించి టీ20 చరిత్రలో సరికొత్త రికా ర్డును నమోదు చేసింది. థాయ్ జట్టు 2018 జూలై నుంచి ఇప్పటివరకు వరుసగా 17 మ్యా చుల్లో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కాగా, మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. అయతే మిగతా బ్యాటర్ల స్కోరు కంటే ఎక్స్‌ట్రాల (5) రూపంలో వచ్చినవే వారి తర్వాత అత్యధిక స్కోరుగా నమోదైంది. థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా జట్ల తర్వాత జింబాబ్వే, ఇంగ్లాండ్ మహిళా జట్లు వరుసగా 14 మ్యాచుల్లో గెలిచాయ.