క్రీడాభూమి

మరో ఆరు వారాల విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమస్టర్‌డామ్, ఆగస్టు 11: తను కోలుకునేందుకు మరో ఆరు వారాల సమయం పట్టనుందని టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. మోకాలి నొప్పితో గత కొద్దిరోజులు ఆటకు దూరంగా ఉన్న రైనా ఇటీవలే నెదర్లాండ్స్‌లో చికిత్స చేయంచుకొని కోలుకుంటు న్నాడు. ఈ సందర్భంగా 32 ఏళ్ల రైనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ లేఖను విడుదల చేశాడు. తను కొలుకునేందుకు సహకరించిన వైద్యులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పాడు.
2007లో మొద టిసారి తనకు మోకాలి శస్త్ర చికిత్స జరిగిందని, ఆ తర్వాత కొలుకొని జాతీయ జట్టులో రాణించానని చెప్పాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మోకాలి నొప్పి ఇబ్బంది పెట్టిందన్నాడు. అయనా దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్ మ్యాచుల్లో ఆడానని, నొప్పి తీవ్రం కావడంతో రెండోసారి మోకాలికి శస్త్ర చికిత్స చేయంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. వైద్యులు 4-6 వారాల విశ్రాంతి అవసరమని చెప్పారని, త్వరలోనే తిరిగి కోలుకొని మైదానంలో అడుగు పెడతానని రైనా ధీమా వ్యక్తం చేశాడు. రైనా ఆస్పత్రిలో ఉన్న ఫొటోను బీసీసీఐ కూడా తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది.