క్రీడాభూమి

రికార్డుల రారాజు కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తున్నాడు. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా కెప్టెన్ తాజాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రెండో అంతర్జాతీయ వనే్డలో మరో రెండు రికార్డులను సవరించాడు. గతంలో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఘనత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ (1930) పేరిట ఉండగా, ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఆనాటి రికార్డును తిరగ రాశాడు. ఈ పరుగులు చేసేందుకు మియాందాద్‌కు 64 మ్యాచ్‌లు పట్టగా, కోహ్లీకి కేవలం 34 మ్యాచ్‌లే పట్టాయ.
దాదాను వెనక్కి నెట్టి..
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సైతం ఈ మ్యాచ్ ద్వారా విరాట్ వెనక్కి నెట్టాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో గంగూలీ (11363) పరుగులతో 8వ స్థానంలో కొనసాగుతుండగా, కోహ్లీ వెస్టిండీస్‌పై సెంచరీ చేసి 11406 పరుగులతో గంగూలీని కిందకు నెట్టి 8వ స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించాడు. కోహ్లీ కంటే ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (18426) ఉన్నాడు.
ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు..
రన్ మిషన్ కోహ్లీ ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా సెంచరీతో విరాట్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై ఎనిమిదేసి సెంచరీలను బాదాడు. ఇలా మూడు జట్లపై 8 సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డును సృష్టించాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా పై 9 సెంచరీలు సాధించి, ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో ముందున్నాడు. అయతే శ్రీలంకపై కూడా సచిన్ 8 సెంచరీలు బాదాడు.
కెప్టెన్‌గా ఒక జట్టుపై..
కెప్టెన్‌గా ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ అందరికంటే ముందు వరుసలో నిలిచాడు. విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌పై 6 సెంచరీలు సాధించాడు. కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ న్యూజిలాండ్‌పై 5, ఇంగ్లాండ్‌పై 4, భారత్‌పై 4 చేయగా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ భారత్‌పై 4 సెంచరీలను నమోదు చేసి మూడో కోహ్లీ, పాంటింగ్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాడు.
తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2వేలు..
ఒక జట్టుపై తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2వేలు పరుగులు చేసిన ఘనతనూ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా అందుకున్నాడు. వెస్టిండీస్‌పై కోహ్లీ కేవలం 34 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించగా, రోహిత్ శర్మ 37 ఇన్నింగ్స్‌ల్లోనే ఆస్ట్రేలియాపై 2వేల పరుగులు చేశాడు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం 40 ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాపై 2వేల పరుగులను పూర్తి చేయగా, వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ 44 ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాపై 2వేల పరుగులను పూర్తి చేశాడు. శ్రీలంక జట్టుపై భారత మాజీ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెవాగ్ 44, మహేంద్రసింగ్ ధోనీ 45 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్న వారిలో ఉన్నారు.
7 సెంచరీల దూరంలో..
కోహ్లీ 42 సెంచరీలతో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్లలో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ (49) కోహ్లీ కంటే ముందున్నాడు. వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (30), శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య (28), దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీం ఆమ్లా (27) , రోహిత్ శర్మ (27) ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్ మినహా మిగతా వారంతా వీడ్కోలు పలికినవారే.

చిత్రం... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ